ఎప్పటికైనా అహం నాశనమే





నేను- అనేఅహంకారమే పతనానికిహేతువు.దానికి దూరందూరం!

★"నేను అన్నిటికన్నా శుభప్రదం. మంగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమంగళం" అంది మామిడాకు.అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి. 
★"నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు. కరివేపాకులు కూరలో తప్పనిసరి. కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి.
★"అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు. అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్తకుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది.. 
★"అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు. అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు.
★పాపం... తులసి ఆకు🍃 ఏమీ అనలేదు. తన గొప్ప చెప్పుకోలేదు. అందుకే దాన్ని 🌳👏పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు.
                        

★ఎప్పటికైనా అహం నాశనమే★




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది