ఆవేశం వలన స్వీయ సమస్యలే కాదు, ఇతరులకు కూడా ఇబ్బందే






విద్యార్థి మార్కులే తెలివితేటలకు దర్పణం కాదు.
అలానే, పరిపక్వత వయసున్నంత మాత్రాన రాదు.
విజ్ఞత, వివేకము, పరిక్వత లకు వయసుకు సంబంధం లేదు.

చదువుకు సంస్కారానికి కూడా సంబంధం లేదు.

మంచితనానికి ధనానికి సంబంధం లేదు.

ఒకటి కావాలనుకుంటే వచ్చేది మరొకటి ఇంట్లో, వంట్లో(mind) ఉంటే అభివృద్ధి చెందేది.

విత్తనము బట్టే కదా మొక్క.

అయితే, ఆస్తి, అంతస్తు కావాలన్నా
ఆత్మీయత, అనుబంధం నిలవాలన్నా నిరంతర శ్రమ అవసరం.

ఆవేశం వీటికి పెద్ద అవరోధం.
ఆలోచన అత్యుత్తమ పెట్టుబడి.
Idea(ఆలోచన) జీవితాన్నే మార్చేస్తుంది.
ఆవేశం కూడా మార్చేస్తుంది.
అయితే, ఒకటి పురోగతి ఇంకోటి అధోగతి.

ఆవేశం వలన స్వీయ సమస్యలే కాదు, ఇతరులకు కూడా ఇబ్బందే. కొన్ని సందర్భాలలో ఓ పెద్ద శిక్షే.

"అన్నీ ఉన్న ఇస్తరి" అణిగుండటం,
లేదా "తోకతెగిన గాలిపటం"లా గమ్యం (దశ దిశ) ఎరుగకుండటం 
రెండూ మన చేతులోవే.
నిర్ణయం మనదే.

ఆలోచించండి.

నమస్కారం




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది