🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *04 ఫిబ్రవరి *
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక దినాలు*
🚩 *ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం*
[నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: ప్రపంచం లోనే అతి ఖరీదైన వ్యాధిగా పేరొందిన కాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండండి. ఆరోగ్యంగా జీవించండి.
శరీరకణాల మనుగడకు ఆహారం, ఆక్సిజన్ కావాలి. ఇవి రక్తం ద్వారా వాటికి చేరుతాయి. ఏ కణానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణాలు ఆరోగ్యకణాలపై దాడి చేసి ఎక్కువ మొత్తంలో వీటిని గ్రహించేందుకు ప్రయత్నిస్తాయి. దీన్ని 'ట్యూమర్ యాంజియోజెనెసిస్' అంటారు. ఇది తీవ్ర రూపాంతరం చెంది క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. ఆరోగ్యమైన జీవనశైలితో శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే క్యాన్సర్‌ని జయించవచ్చని నిపుణుల మాట.]
🚩 *శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం*
[శ్రీలంక (ఆధికారికంగా డెమోక్రటిక్ సోషలిష్టు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక)ను 1972కు పూర్వం సిలోను అనేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. జనాభా సుమారుగా 2 కోట్లు.]
◙ స్వాతంత్ర్యము-యునైటెడ్ కింగ్‌డం నుండి
◙ ప్రకటన-ఫిబ్రవరి 4 1948
◙ గణతంత్రము-మే 22 1972
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.
✴️1509 : శ్రీ కృష్ణదేవ రాయలు విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1891: మాడభూషి అనంతశయనం అయ్యంగారు, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు
❇️1908: మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
❇️1910: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు
❇️1911: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
❇️1913 : ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి రోసా పార్క్స్
❇️1936 : హిందీ నటీమణి వహీదా రెహమాన్ జననం.
❇️1938: కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.
❇️1943: Father of Indian Christian Law Dr Kande Prasada Rao.
❇️1943 : భారతదేశంలోని భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం జననం.
❇️1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా
❇️1962: డాక్టర్ రాజశేఖర్, తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు
❇️1972: శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚫️ *మరణాలు*
◾️1973: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది
◾️1974 : భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ మరణం (జ.1894).
◾️1993: భారత విద్యావేత్త డి.ఎస్.కొఠారి.
◾️2019: పిళ్లా రామారావు స్వాతంత్య్ర సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు.🙏🏻