🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *01 ఫిబ్రవరి *
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
ఫిబ్రవరి (February), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో రెండవ నెల. ఫిబ్రవరి నెలను రోమన్ క్యాలెండర్‌లో సా.శ.పూ.713 లో చేర్చబడింది. నెల పొడవు కాలక్రమేణా మారిపోయింది. ఒక సమయంలో దీనికి 23 రోజులు మాత్రమే ఉన్నాయి.భారతదేశంలో, ఫిబ్రవరి నెల శీతాకాలపు చివరి చల్లని నెల. జూలియస్ సీజర్ రోమన్ క్యాలెండర్‌ను పునర్నిర్మించినప్పుడు, సాధారణ సంవత్సరాల్లో ఈనెలకు 28 రోజులు, ప్రతి నాలుగు సంవత్సరాలకు వచ్చే లీపు సంవత్సరాల్లో 29 రోజులు ఉంటాయి.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక దినాలు*
🚩 *భారతీయ తపాలా బీమా దినం*
🚩 *భారత తీర రక్షక దళ దినోత్సవం*
🚩 *సూరజ్‌కుండ్ వృత్తి పనిముట్లు మేళా దినోత్సవం*
🚩 *ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 9 వరకు - కాల ఘోడా పండుగ*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️1977: భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.
✴️1996: ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం)
✴️2003: అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
✴️1986: జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1929: జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012)
❇️1933: వెల్చేరు నారాయణరావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు.
❇️1936: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (మ.2016)
❇️1945: బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్త.
❇️1956: సుధాకర్, తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు, నిర్మాత.
❇️1956: బ్రహ్మానందం, నవ్వుల రారాజు.. కామెడీ 'బ్రహ్మ', తెలుగు చలనచిత్ర హాస్యనటుడు.
[కామెడీ టైమింగ్‌తో సిల్వర్ స్క్రీన్ షేక్ చేసిన హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం. ఆయన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఓ రిలాక్సేషన్. ఆయన డైలాగ్స్ కామెడీ టానిక్. 'ఖాన్‌తో గేమ్స్ వద్దు.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు' అంటూ ప్రజల హృదయాల్లో ప్రత్యేకస్థానం సంపాదించారు. పద్మశ్రీ గ్రహీత. వెయ్యికిపైగా చిత్రాలతో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన లాఫింగ్ లెజెండ్. నేటి తరానికి మీమ్స్ కింగ్.. బ్రహ్మానందానికి హ్యాపీ బర్త్ డే.]
❇️1961: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
❇️1965: అంథోనీ పీటర్ కిశోర్, అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు.
❇️1971: అజయ్ జడేజా, భారత క్రికెట్ క్రీడాకారుడు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚫️ *మరణాలు*
◾️1986 : భారత దౌత్యవేత్త, రాజకీయవేత్త, రచయిత ఆల్వా మిర్థాల్ మరణం.
◾️1998: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (జ.1915)
◾️2003: కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యొమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962)
[దేశం గర్వించదగ్గ వ్యోమగామి. భారతదేశం నుంచి అంతరిక్షంలో ప్రవేశించిన తోలి మహిళ. ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తి.]
◾️2009: రణబీర్ సింగ్ హుడా, భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు.
◾️2017: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (జ.1925) 🙏🏻