ఒక ప్రాచీన నేపాలీ కథ చదవండి.





[Forwarded from sai babu]
one of the story from Yandamoori SIR collections

ఒక ప్రాచీన నేపాలీ కథ చదవండి. ఈ కథకు నాదైన రీతిలో బాగా నాటకీయత, సంభాషణలూ చేర్చటం జరిగింది.

చిన్నపుడే తల్లిని కోల్పోయిన పరిణీత చాలా అందమైన, నెమ్మదస్తురాలైన అమ్మాయి. తాను ఇలా మారిపోతుందనీ, అసలిలా ఆలోచిస్తుందనీ ఆమె కలలో కూడా అనుకోలేదు. వివాహం జరిగి అత్తారింటికి వెళ్ళిన మొదటి పది రోజులూ బాగానే ఉంది కానీ, ఆ తరువాత ఆమె కష్టాలు ప్రారంభం అయ్యాయి.

భర్త మంచివాడు. కానీ నోట్లో నాలుక లేదు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో తల్లే పెంచింది. దాని వల్ల అతనిపై తనకే పూర్తి అధికారం ఉన్నదని ఆమె అనుకుంటూ ఉంటుంది. అతను కూడా తల్లి పట్ల అదే భావంతో ఉంటాడు. దాంట్లో ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు గాని, పరిణీత ఆ ఇంట్లో అడుగు పెట్టగానే, తన కొడుకు ఎక్కడ చేతిలోంచి జారిపోతాడో అన్న భయం ఆమె అత్తగారికి పట్టుకుంది. అందుకని, కొడుకు చుట్టూ ఒక వృత్తం గీసేసింది.
బయటవారికి ఆమె చాలా మంచిది. కానీ అసలు విషయం పరిణీతకే తెలుసు. ప్రతి చిన్న పనికీ దెప్పిపొడవటం, పుట్టింటివారిని విమర్శించటం, కొడుకుతో గంటల తరబడి గుసగుసలాడటం ఆ అమ్మాయిని చాలా బాధ పెట్టేవి. పెళ్ళయినప్పటి నుంచీ ఆమెకు ఒకటే అనుమానం. తనని ఆమె చేసుకుందా? అతను చేసుకున్నాడా? అని.

ఎన్నో కలల్తో ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఆమె కలలు కల్లలయ్యాయి. తల్లి విషయంలో భర్త అంటీ ముట్టనట్టూ ఉండేవాడు. రోజులు వారాల్లోకీ, వారాలు నెలల్లోకీ మారేకొద్దీ, పరిణీత జీవితం దుర్భరంగా మారింది. నేపాల్ దేశపు కట్టుబాట్ల ప్రకారం ప్రతీ కోడలూ అత్తగారి మాట వింటూ అణిగిమణిగి ఉండాల్సిందే. కానీ పరిణీత వ్యక్తిత్వం కలది. దాంతో ఎదురు తిరిగింది.

ఎదురు జవాబులు చెప్పటం, ధిక్కారం, పెడసరిగా మాట్లాడటంతో అత్తా కోడళ్ళ మధ్య చిన్నగా మొదలైన కలహం, త్వరలోనే తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ పరిణామాల్తో అందరికన్నా నలిగిపోయినవాడు భర్త. ఇటు తల్లికీ, అటు భార్యకీ చెప్పలేక ఇంటి పట్టున ఉండటం మానేసాడు.
ఆ ఇంట్లో అత్తగారితో పాటు తాను ఉండలేనని ఆమెకు అర్థమైపోయింది. ఒక్కగాను ఒక్క కొడుకుని వదిలి ఆ ముసల్ది ఎక్కడకూ వెళ్ళదని కూడా రూఢీ అయింది. ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలని తెలుసు. కానీ ఏo తీసుకోవాలో తెలీదు.
ఆమె ఇటువంటి కన్‌ఫ్యూజన్‌లో ఉండగా ఆమె ఇంటికి ఆమె మామయ్య వచ్చాడు. తల్లి అన్నయ్య. ఆయన ఒక ఆయుర్వేద డాక్టరు. చిన్నప్పటి నుంచీ ఆయన ఆమెని ఎత్తుకుని పెంచాడు.
పరిణీత ఆయనకి ఏ విషయమూ దాచకుండా చెప్పేసింది. చివర్లో అన్నది "ప్రతీ చిన్న దానికీ ఆయన నోటివెంట 'అమ్మా’ అన్న పదం తప్ప మరో మాట రాదు. ఒకోసారి ఈ సంసారం చేయటంకన్నా ఆత్మహత్య చేసుకోవటం మంచిదనిపిస్తుంది..." అంటూ ఏడ్చింది.

ఆయన ఆ ఇంట్లో రెండు రోజులు ఉండి, అత్తా కోడళ్ళ మధ్య జరుగుతున్నదంతా గమనించి ఒక నిర్ణయానికి వచ్చినట్టూ, "ఆమె చనిపోతే గానీ సమస్య పరిష్కారం కాదు" అన్నాడు.
ఆ మాటకి ముందు కలవరపడ్డా క్షణం ఆగి, ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా, "అవును ఆమె చనిపోవాలి" అన్నదామె. తాను ఇలా మారిపోతుందనీ, అసలిలా ఆలోచించగలదనీ ఆమె కలలో కూడా అనుకోలేదు. తరువాత ఇద్దరూ ఆ విషయమై చాలా సేపు మాట్లాడుకున్నారు.
ఆయన రెండు రోజులపాటూ అడవి అంతా తిరిగి కొన్ని మూలికలు తెచ్చి వాటితో మాత్రలు తయారు చేసాడు. ఆమెకి వాటిని ఇస్తూ రహస్యంగా, "ఇవి రోజుకొకటి చప్పున ఆర్నెల్ల పాటూ వాడాలి. నీ అత్తగారు మొదటి రోజే చనిపోతే అందరికీ అనుమానం వస్తుంది" అన్నాడు. పరిణీతకి కూడా ఈ ఆలోచన బాగానే ఉన్నదని అనిపించింది. అతడి దగ్గర నుంచి ఆ పొట్లాలు తీసుకుంది.
ఆ మరుసటి రోజు ఆయన వెళ్ళిపోతూ "నా మూలికలు ఆమెని రోజురోజుకీ రక్తహీనం చేసి కొద్దికొద్దిగా చంపుతాయి. ఆమె బలహీనం అవుతున్న సమయంలో ఏమాత్రం ఉద్వేగం చెందినా, కోపం వల్ల ఆవేశపడినా గుండె ఆగిపోతుంది. అటువంటి పరిస్థితులు రానివ్వకు” అన్నాడు.
"కానీ ఆమె మరణించటమేగా మనకి కావాలి" అన్నది పరిణీత.
"పిచ్చిదానా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఈ విషప్రయోగంవల్ల, మరణించిన అరగంటలో ఆమె శరీరం నల్లగా కమిలిపోతుంది. నీకూ ఆమెకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఈ గ్రామంలో అందరికీ తెలుసు. ఎవరికైనా అనుమానం వచ్చి శవపరీక్షలు జరిపితే నీతో పాటూ నేను ఉరికంబం ఎక్కక తప్పదు”
ఆమె అప్రతిభురాలైంది. ఈ అనుమానం ఆమెకు ఇంతకు ముందు రాలేదు.
“…ఆర్నెల్ల వరకూ ఆమె మరణించకూడదు కానీ బలహీనం అవ్వాలి. చుట్టు పక్కల వారికి ‘ఆమె అనారోగ్యం పాలవుతోంది’ అన్న అభిప్రాయం కలగాలి. అన్నట్టూ మరో విషయం. ఈ ఆర్నెల్ల కాలం ఎవరికీ అనుమానం రాకుండా నువ్వు ఆమెతో స్నేహంగా ఉండు. ఆమెకే మాత్రం కష్టం రాకూడదు " అన్నాడు.
మామయ్య చెప్పింది పరిణీతకి స్పష్టంగా అర్థమయింది. చుట్టుపక్కల వాళ్ళు చూస్తూండగా అత్తగారితో చాలా ప్రేమగా ఉండటం సాగించింది. ఆవిడ ఆవేశం చెందకుండా, ఉద్వేగపడకుండా జాగ్రత్తలు తీసుకుంది. వాదన ఏమాత్రం శృతి మించుతోందని అనుమానం వచ్చినా దాన్ని అక్కడితో ఆపు చెయ్యటం, తిట్టినా తల దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవటం, కొడుకుతో ఆవిడ ఎంత సేపు గడిపినా యాగీ చెయ్యకపోవటం, ఆ ముసలిదానికి ఇష్టమైనవి చేసి పెట్టటం ప్రారంభించింది.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది