🌎 *చరిత్రలో ఈ రోజు* 👉 *29 జనవరి *





🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *29 జనవరి *
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక  దినాలు*    
🚩 *అంతర్జాతీయ పజిల్స్ దినోత్సవం*
[తల్లిదండ్రులు పిల్లల ఆటలపై శ్రద్ధ కనబర్చాలి. మేధోశక్తిని పెంచే పజిల్స్‌ను నేర్పించాలి. పిల్లలు కంప్యూటర్‌, టీవీలకు అతుక్కు పోవద్దని ఎంతచెప్పినా వినకుండా గంటలకొద్ది చూస్తూనే, ఆడుతూనే ఉంటారు. అలాంటి వారికి కంప్యూటర్‌లోని పజిల్స్‌ను నేర్పించాలి. పజిల్స్‌ను పూరించేలా నేర్పించడం వల్ల క్రమేణా అలవాటు పడ్తారు. మేధోశక్తి పెరుగుతుంది.]
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️1780: భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
✴️1939: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
✴️1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
✴️2006: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.
✴️2008: మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1860: అంటోన్ చెకోవ్, రష్యన్ నాటక రచయిత.(మ.1904)
❇️1901: మొసలికంటి తిరుమలరావు, స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు. (మ.1970)
❇️1920 : తెలుగు సినిమా సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంత రావు జననం (మ.2018).
❇️1926: అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
❇️1932: పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
❇️1936: వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
[వేటూరి సం 'గీతమే'.. ఓ అద్భుతం. ఆయన కలం నుంచి జాలువారే సరిగమ పదనిసలు తెలుగు హృదయాలను ఊర్రూతలూగించాయి. 'వేణువై వచ్చాను, రాలిపోయే పువ్వా' అంటూ హృద్యాన్ని మేళవించిన గీతాలందించాయి. విషాదమైనా.. విరహమైనా ఆయన పెన్ను కదిపితే శ్రోతలు దాసోహం అవ్వాల్సిందే. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయఖ్యాతిని తెచ్చిపెట్టింది ఆయనే. వేటూరి కలం మనకందించిన సంగీతం ఎప్పటికీ మధురమే.]
✍️ నడు సంగీత ప్రపంచంలో ఆణిముత్యంలాంటి వేటూరి సుందర రామ్మూర్తి జయంతి.
❇️1936: బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014)
❇️1947: రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త.
❇️1951 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఆండీ రాబర్ట్స్ జననం.
❇️1962 : గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.
❇️1970 : భారతీయ షూటర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ జననం.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚫️ *మరణాలు*
◾️2010: రాం నివాస్ మీర్థా, భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి.
◾️2010: చోళ లింగయ్య, తెలంగాణ పోరాటయోధుడు. 🙏🏻





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది