పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై ..
ఆ...డ జతులా..డ..
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా..
అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగా..
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో.. కలలొచ్చాయిలే..
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే.. కధ చెప్పాయిలే..
అనుకోనిరాగమే.. అనురాగ గీతమై..
వలపన్న గానమే.. ఒక వాయులీనమై..
పాడె..మదిపాడె..
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
పట్టుకుంది నాపదమే.. నీ పదమే పారాణిగ..
కట్టుకుంది నా కవితే.. నీ కళలే కళ్యాణిగ..
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకి.. స్వరమిచ్చావులే..
ఇరు తీరాల గోదారి గంగమ్మకే.. అలలిచ్చావులే..
అల యెంకి పాటలే ఇల పూలతోటలై..
పసిమొగ్గరేకులే.. పరువాల చూపులై..
పూసె..విరబూసె..
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై
ముల్లోకాలె కుప్పెలై జడకుప్పెలై
.. ఆ...డ జతులాడ..
పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
Key Words : Telugu WhatsApp,Seetharamaiah Gari Manavaralu Songs - Pusindi Pusindi Punnaga