ఈ మట్టే కదరా...నీ ...





*మట్టిబంధమతడు*

ఈ మట్టే కదరా...నీకన్నం పెట్టేది...
ఈ మట్టే కదరా...నీ అడుగులు మోసేది...
ఈ మట్టే కదరా... నీ ప్రాణం నిలిపేది...
ఈ మట్టే కదరా...నీ దేహం కప్పేది...

ఈ మట్టితల్లిని గొప్పదిరా....
ఈ మన్ను నమ్ముకుని 
తన శ్రమనే అమ్ముకుని 
మట్టిలోనే మురిచిపోయే..మట్టి మనిషిని గౌరవించరా...
అన్నం పెట్టి ఆయువు నిలిపే అన్నదాతను ఆదరించరా...
అన్నదాతల చిరునవ్వే సమాజానికి సంపదరా...

నేలమ్మ మొదటి కొడుకు రైతేనురా...
నేలమ్మ మెడలో హారం పంటేనురా...
నేలమ్మ నెర్రబారితే నీరునిద్ర మానేసి నింగిని చూసే చాతకపక్షి మట్టిమనిషిరా...
ఈ తల్లి కొడుకుల బంధంతో ప్రకృతే పరువశించునురా...

రైతు బ్రతుకే ఆశల వరిమడిరా...
రైతు గాధ కన్నీటి నారు మడిరా...
రైతన్నే సమాజ గుడిరా...
ఒడిడుకుల ఆ గుడిలో దైవాన్ని రక్షించుకునే బాధ్యత సమాజానిదిరా....

ఈ మట్టే కదరా...నీకన్నం పెట్టేది...
ఈ మట్టే కదరా...నీ అడుగులు మోసేది...
ఈ మట్టే కదరా... నీ ప్రాణం నిలిపేది...
ఈ మట్టే కదరా...నీ దేహం కప్పేది...

*అభిరామ్*



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది