💗నేడు ప్రేమికుల దినోత్సవం
అది నిజమైన కల్మషం లేని ప్రేమకి మాత్రమే ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు
నేడు అలాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని అంటారా అది ఒక్క తల్లిదండ్రుల దగ్గర మాత్రమే దొరికేది
ఎందుకంటే మనము ఎలా ఉంటామో తెలియదు ఎలా పుడతామో తెలియదు అయినా పంచ ప్రాణాలు పెట్టుకుని నవమాసాలు మోసి కనీ మన భవిష్యత్తు కోసం వాళ్లు ఎన్నో కలలు కంటూ ఉంటారు అందుకే
నిజమైన కల్మషం లేని ప్రేమ వీళ్లది మాత్రమే
నేటి సమాజంలో కొత్త సినిమాల ప్రభావం కొంత... సీరియళ్ల ప్రభావం కొంత సమాజంలో ఉన్న జాడ్యం వలన ప్రేమలు ఎలా ఉన్నాయంటే
కామ ప్రేమలో
నువ్వు నాకు నచ్చినట్లు ఉన్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు నాకు అన్ని పనులు చేసి పెడుతున్నావ్ కాబట్టి నేను ప్రేమిస్తున్నా నాతో ఉండి నా భజన చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నా నాకు గిఫ్ట్ లు షాపింగ్ బండి మీద ఎటు కావాలంటే అటు తిప్పున్నావ్ కాబట్టి ( అవసరం కోసం) నిన్ను ప్రేమిస్తున్నా
నేటి కాలం ప్రేమలో ఇలా ఉన్నాయి
ఈ ప్రేమ కోసం వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుని
చివరాకరికి ప్రేమ విఫలం అయ్యి చనిపోయిన వాళ్ళు చంపబడుతున్న వాళ్ళు కూడా కోకొల్లలు
ప్రేమించిన వాళ్ళ కోసం ఇంటిలో వాళ్ళు చనిపోయారు అనుకొని లేచిపోయి పెళ్లి చేసుకొని
ప్రేమించుకున్నప్పుడు కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది ఇంకా ఏమీ ఉండదు పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు నెత్తి మీద పడితే చిన్న చిన్న ఘర్షణలు కూడా అర్థం చేసుకోలేక ప్రేమ వీగిపోయింది అని
అవసరం తీరిపోయిన తర్వాత అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి వదిలేసి
ఆ మనస్తాపం తట్టుకోలేక చనిపోతున్న వాళ్ళు కోకొల్లలు వీళ్ల వల్ల చాలా మంది చాలా మంది పిల్లలు అనాథలు అవుతున్నారు
దీంతో ఇంకో కోణం కూడా ఉందండోయ్ పెళ్లి అయిన వాళ్ళు కూడా వాళ్ళ కడుపుకి ఏమి తింటున్నారు తెలియదు కానీ పరాయి వాళ్ళ వ్యామోహంలో పడి ఇంట్లో వాళ్ళని రాచిరంపాన పెడుతూ( మొగుడు పెళ్ళాం మధ్య వచ్చిన గొడవలు వాళ్ళిద్దరే సరి చూసుకోకుండా సోషల్ మీడియా ఎవరెవరికో పంచుకోవడం వల్ల మాయమాటలు చెప్పి లోబర్చుకోవడం ఇలాంటివి నేడు జరుగుతున్నది)
దీనివలన కట్టుకున్న వాళ్లని ఆఖరికి కన్నబిడ్డలను కూడా కడతేర్చి చివరాకరికి వాళ్లు జైలుపాలు అవుతూ వాళ్లకి పిల్లలు ఉంటే వాళ్ళని అనాథలను చేస్తూ వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు
నేటి తరం ప్రేమలు కేవలం అవసరాల కోసం లేదా కామవాంఛ కోసం మాత్రమే పుడుతున్నాయి
ఇలాంటి ప్రేమలు ఉండబట్టే
నేటి సమాజంలో ప్రేమ అనే పవిత్రమైన పదం
అపహాస్యం అవుతుంది.
సామి సుధాకర్