నాగసాదువులు-నానో టెక్నాలజీ
ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే....
మన ఋషులు,యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు.
మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం గుర్తుంది కదా. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు ,మాన సంరక్షణ కోసం తను శ్రీ కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడుతాడు. దానికి ఆటను ఎంచుకున్న ప్రయాణ సాధనం నానో టేక్నాలజీయే. త్రిలోక సంచారి ఐన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించే వాడు. ఇదంతా చదివి సాదిక్ భాయ్ కి మతి భ్రమించి రాస్తున్నాడు, అని మిత్రులు భ్రమపడే అవకాశం వుంది.
అందుకే ,ఇక్కడ ఒక సజీవ ఉదాహరణ ఇస్తున్నాను.
హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళా లు గుర్తున్నాయి కదా. అక్కడికి లక్షలాది మంది నాగసాదువులు రావటం మనం టీవీల్లో,పేపర్ లలో చూశాం. నాగసాదువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో,నదీ తీరాల్లో వుంటారు.మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి.
ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం.కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ,వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా?
ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో ,ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే?
సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?
వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం .అదే నానో టెక్నాలజీ.నాగసాదువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం.ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు,జర్మనీ వాడు చెప్పే సొల్లు అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.
key words: naga sadhu power in telugu
-----------------------------------------
English Translation
-----------------------------------------
Nanotechnology is one of the most popular topics in science today. Western countries are spending billions on research on this. What is unfortunate is that this nanotechnology has existed in our country for thousands of years. Still exists. Is alive in the Himalayas. Going into details ....
Our sages, yogis and saints told us about the subtle body journey a few thousand years ago. The penance we read in the books is now called meditation. Through this meditation one attains amazing Siddhas. One of them is micro anatomy. This is the advanced stage in nanotechnology. The goal of the research being done now is the same. Our sages and yogis used to travel to the desired destination late. But current rationalists are not ready to believe it.
Do you remember the scene of Draupadi undressing in the Mahabharata? When Dussasa pulls out Draupadi 's sari, he prays to Lord Krishna for his protection. Somewhere in Dwarka, Krishna immediately appeared there and saved Draupadi Sheela. Nanotechnology is the travel tool that the game chooses for it. Narada, a three-world traveler, is always traveling through nanotechnology. After reading all this, Sadiq Bhai is writing in a delusional manner, which is likely to confuse his friends.
Hence, I am giving a living example here.
Do you remember the Kumbh Melas held at Haridwar and Triveni Sangam? We saw millions of Nagas coming there on TV and in the papers. The Nagas are Digambara. They live in the Himalayan caves, hills and riverbanks somewhere far away from the outside world. On normal days they are invisible to anyone. The venues for the Kumbh Mela are a few hundred kilometers away from the Himalayas.
Here we ask ourselves a question. If a few lakhs of Digambars travel a few hundred kilometers at a time, should there be a traffic jam all the way they have traveled? Has such an incident been recorded anywhere so far?
There are many villages, towns and cities along the way. Have millions of Digambars appeared anywhere, to any photographer? Were there any records of these people traveling on special planes and other means of transportation?
How exactly does everyone live at the same time, at the Kumbh Mela venue? At the end of Kumbha Mela, on the way back, how can you appear up to a kilometer away and suddenly disappear? Why is their trail nowhere to be seen except in that area?
The answer to all this is the same subtle body movement. The same nanotechnology. The travel tool used by the Nagas for their long journey. We believe it if there is so much living evidence before our eyes for many years. We hear all the words of Americans, Russians, Chinese, Japanese and Germans. Read our sciences with one mind. Follow them and try to implement. We can teach the world lessons again.