చచ్చిన పాకిస్థానీ సైనికులెంత మంది ?
..................:............................
ఆఫ్రికాలోని జాంజిబార్ దేశానికి ఇంగ్లాండుకు మధ్యన జరిగిన ఈ యుద్ధం ప్రపంచంలో అతి చిన్నయుద్ధంగా రికార్డు చేయబడింది. 27 ఆగస్టు 1896లో జరిగిన ఈ యుద్ధం 38 నిమిషాలలో ముగిసింది.ఇంగ్లాండు దేశం, జాంజిబార్ సింహాసనానికి జరిగిన వారసత్వ తగాదాలలో తలదూర్చడం వలన ఈ యుద్ధం జరిగింది. 500 మంది జాంజిబార్ సైనికులు మరణించారు. ఒక ఇంగ్లాండు సైనికుడు మాత్రం గాయపడ్డాడు.
యువరాజు ఖాలిద్ ఇబన్ బరగాస్ ఓడి లొంగిపోయాడు.
భారతదేశ చరిత్రలో 1192 లో డిల్లి చక్రవర్తి పృద్వీరాజ్ చౌహన్ కు, ముస్లీం దండయాత్రికుడైన మహ్మద్ గోరికి మధ్య జరిగిన రెండవ తరాయిన్ యుద్ధం,
భారతదేశ చరిత్రలో 1526 లో బాబరుకు ఇబ్రహీం లోడికి జరిగిన మొదటిపానిపట్టు యుద్ధం,
1757 లో జరిగిన ప్లాసీ యుద్ధం. రాబర్ట్ క్లైవ్ కు బెంగాల్ పాలకుడైన సిరాజుద్దౌలా కు మధ్య జరిగిన యుద్దం,
1761 లో అఫ్గాన్ అహమద్ షా కు డిల్లిపాలకులైన మరాఠా యోధులకు జరిగిన 3వ పానిపట్టుయుద్ధం
భారతదేశ రాజకీయ భౌగోళిక పరిస్థితులను మార్చిన ప్రముఖయుద్ధాలు.
1962 చైనా భారతయుద్ధంలో 1383 మంది భారతసైనికులు మృతిచెందగా 1047 మంది గాయపడ్డారు. 1696 సైనికుల ఆచూకి దొరకలేదు. 400 మంది యుద్ధఖైదీలుగా పట్టుపడ్డారు.
722 మంది చైనాసైనికులు హతం కాగా 1400 మంది గాయపడ్డారు. భారతం భూభాగాలను కోల్పోయింది.
1965 భారత పాక్ యుద్ధంలో 2862 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. 8617 మంది గాయపడ్డారు.
5800 మంది పాక్ సైనికులు హతులైనారు. హిందూదేశమే విజేత.
1971 భారత పాకిస్థాన్ యుద్ధంలో 3900 మంది భారత వీరసైనికులు వీర స్వర్గమలంకరించారు. దాదాపు 10 వేల మంది గాయపడటం జరిగింది.
దాదాపు 8000 మంది సైనికులను పాక్ కోల్పోగా, దాదాపు 25 వేలమంది గాయపడ్డారు. 93 మంది పాక్ సైనికులు లొంగిపోయారు.
3 వ తేదీ డిసెంబరు 1971 మొదలైన ఈ యుద్ధం 13 రోజులుపాటు జరిగింది. హిందూదేశం విజేతగా నిలిచింది.
1999 కార్గిల్ యుద్ధంలో 527మంది జవానులు భారతదేశం కోల్పోయింది. 1363మంది గాయపడ్డారు.
పాక్ సైనికులు 453 మంది భారత సైనికుల చేతిలో మరణించారు.700 మంది గాయపడ్డారు.
ఈ యుద్ధంలో భారతదేశం గెలిచినా, యుద్ధానికి ముందు నిఘావర్గాలు విఫలమయ్యాయనే విమర్శ వుంది.
మొదటి ప్రపంచయుద్ధంలో దాదాపు 40 లక్షలమంది సైనికులు మృతి చెందగా 20 లక్షలమంది గాయపడ్డారు. చనిపోయిన ప్రజలను కలుపుకొంటే మృతుల సంఖ్య ఒక కోటికి పైమాటేనంటారు.
రెండవ ప్రపంచయుద్ధంలో దాదాపు కోటిమందికి పైగా సైనికులు మరణించగా 70 లక్షలమంది ప్రజలు మరణించారు. గాయపడినవారి సంఖ్య 22 లక్షలు, కనబడకుండా పోయినవారి సంఖ్య దాదాపు 80 లక్షలు.
.....సేకరణ....
............................................................................................జి.బి.విశ్వనాథ., అనంతపురం.