ప్రతీ మనిషికి ఒక విషయం అంటే చాలా ఇష్టం ఉంటుంది





ప్రతీ మనిషికి ఒక విషయం అంటే చాలా ఇష్టం ఉంటుంది  ఆ విషయం గురించి తెలుసుకోవాలనే ఇష్టం కూడా చాలా ఉంటుంది ..

For Example:ఇష్టమైన విషయం బంధాలు..
నాతో నాకు, వేరేవారితో, 
ఆరోగ్యం తో, పరిస్థితులతో, 
డబ్బు తో... ఉండే బంధం ఇలా అన్నీ ....మరియు ప్రేమ బంధం ఒకటో రెండో విషయాలు బాగా  నేర్పిస్తూనే ఉంటుంది కూడా..

ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వారి మనసులు ఒకరినొకరు స్వాగతిస్తూనే..
చాలా సున్నితమైన దుర్బలమైన స్థితిలో ఉంటాయి..

అలాంటప్పుడు ఎంత ఎక్కువ ప్రేమ ఉంటుందో అదే స్థాయి లో గాయపడటం కూడా సహజం...

కానీ తాము బాధపడిన విషయాన్ని తాము ప్రేమించినవారికి విడమర్చి చెప్పరు..

ఎందుకంటే తాము ప్రేమించినవారిని బాధపెట్టకూడదు అనుకుని..

అలాంటి నిర్ణయం వలన మనసులో ఒక తెర నెమ్మదిగా మొదలవుతుంది..

ఒక బాధని దాచుకోవటం అనేది కొంచెం దూరాన్ని పెంచుతుంది..

ఇది రెండువైపులా ఉంటుంది..

అలా రెండు మనసుల కు మధ్య కొన్ని గోడలు కట్టుకోవడం మొదలవుతుంది...

నన్ను ప్రేమిస్తున్నారా లేదా అనే సందేహం మనసుని పట్టిపీడిస్తుంది..

ఒకరికి ఒకరు ప్రేమని ఇచ్చిపుచ్చుకోవటం తగ్గుతూ వస్తుంది...

మన మనసులు ఒకరికోసం ఒకరం మూసివేసుకుంటాము..

మూసిన మనసులు తెరిచే తాళాలను మన చేతిలోనే ఉన్నా సరే.. ఉపయోగించము...

మన ని మనమే బంధించేసుకుంటాము..

మన ని గాయపడ్డవారిగానూ, మనం ప్రేమిస్తున్న వారు మన బాధకి కారకులుగానూ భావిస్తాము..

వారిదే తప్పు అనుకుంటాము..

ఇప్పుడు మన ప్రేమే మనకి అడ్డుగోడగా మారినట్లుగానూ..

ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు వేసుకునేలాగా మారుతుంది..

ఉదాహరణకి భార్య భర్తలు ఒకరి గురించి ఒకరు వేసుకునే
విమర్శల విసుర్ల 
బాణాలు, 
సాధింపులు, ..

ఇది ఒక చక్రంలాగా ఒక వైపు నుంచీ ఇంకోవైపుకి తిరుగుతూనే ఉంటుంది..

ప్రేమ దొరకట్లేదని ప్రేమను ఇవ్వడం మానేస్తారు..

అంతే ప్రేమ లేని బంధం బాలేదని ఇంకో చోట ప్రేమను వెతుక్కుంటారు...

ఇదే విధంగా తమ సొంతగూడులో ప్రేమ దొరకట్లేదని బయట ప్రేమ ని వెతుక్కుంటున్న మరొకరు వీరికి దొరుకుతారు..

ఫలితంగా ఇంట్లో ఆనందానికి ఒక సౌకర్యం,

 బయట భావాల లోటు భర్తీ చేసుకునేందుకు ఇంకొకరు అనే పరిస్థితి తయారవుతుంది...

ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఏదో ఒకవైపు చిరాకుగా తయారయ్యేదాకా...

ఇలా కాకుండా ఉండాలంటే మనసులకు తెరలు తగిలించుకోకూడదు,
గోడలు కట్టుకోకూడదు...

ఒక బాధ ప్రేమించేవారినుంచీ ఎదురవగానే నీ వల్ల నాకు ఈ బాధ కలిగింది అని సౌమ్యంగా అర్ధమయ్యేలా చెప్పుకోవాలి...

సాధారణంగా ఇలాంటి స్పష్టత ను అర్థం చేసుకునే సున్నితత్వం ఎదుటివారి లో ఉండేది తక్కువే..

వారు అపార్ధం చేసుకుని బంధాలు బీటలు వారే సందర్భాలే ఎక్కువ..

కాకపోతే చాలా కాలం అడ్డు గోడలు కట్టుకుని క్రృత్రిమంగా జీవించకుండా ఉండటానికి స్పష్టత అవసరం...

కొందరు మనం మన బాధను స్పష్టంగా చెప్పినప్పుడు వారు కూడా నిజాయితీగా తమకు మన వలన కలిగే ఇబ్బందులు గురించి కూడా స్పష్టంగా చర్చించగలిగితే ఇద్దరి మనసులకు మధ్యన ఒక మంచి దారి ఏర్పడుతుంది, ఎటువంటి అనవసర అడ్డుగోడలు, పరదాలు లేకుండా...

అలాంటి బంధంలో ప్రేమ ఏ షరతులకు లోబడి ఉండక్కర్లేదు...

వారిద్దరి మధ్య ప్రేమ ఎప్పటికీ ధ్రృడంగా మారుతుంది...

ఒకరికొకరు బాగా అర్ధమవుతారు...

కొంతమందికి సరిగ్గా ప్రేమించటం అనేది స్పష్టంగా తెలిసి ఉంటుంది...

కొంతమంది  ప్రేమించటం అంటే ఏమిటో కొన్ని పాఠాల ద్వారా నేర్చుకుని మళ్ళీ సరైన తీరులో ప్రేమించటం మొదలుపెట్టి బంధాన్ని కాపాడుకుంటారు..

బంధాన్ని ప్రేమతో జీవిస్తారు....

అనువాదం : తులసీభాను.

సేకరణ : సుమన్ శాయని గారు.






కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది