మనుషులు శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు కానీజంతువుల్ని చంపి భుజిస్తారు ఎందుకో తెలియదు





మనుషులు శవాన్ని  ముట్టినందుకు స్నానం చేస్తారు కానీ
జంతువుల్ని చంపి భుజిస్తారు ఎందుకో తెలియదు

 కొవ్వొత్తులు వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు 
అదే కొవ్వొత్తులను  ఆర్పి జన్మదినాన్ని జరుపుకుంటారు

    వెంటరాని ఇంటిని ఒంటిని రోజుకు కడుగుతావు
 మరి నీ వెంట వచ్చే  మనసును ఎప్పుడూ  కడుగుతావు.

 పని చేయడానికి పని మనిషి దొరుకుతారు.
వంట చేయడానికి వంట వారు దొరుకుతారు.
కానీ నీకు రోగం వస్తే నీకు బదులు భరించేవారు ఎవరు దొరకరు.

 రైలు ప్రయాణం జనరల్  బోగీలో వెళ్ళినా 
ఫస్ట్ క్లాసులో  వెళ్ళినా  స్టేషన్ రాగానే అందరూ ఒకేసారి దిగిపోతారు

 కళ్లతో ఈ జగత్తును చూస్తే కేవలం దృశ్యాలే కనబడతాయి.
హృదయంతో  చూడ గలిగితే జగత్తు అంతా సుందర మే

 కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ  పాత  మట్టలు రాలిపోతాయి
అలాగే జ్ఞానం కలిగే  కొద్ది
 తన పర బెదాలు తొలగిపోతాయి.

 ప్రకృతి చాలా విచిత్రమైనది

ప్రాణం పోయిన జీవులను నీళ్లలో  తేలే  టట్లు చేస్తుంది

ప్రాణం ఉన్న జీవులను నీళ్ళలో ముంచె టట్లు చేస్తుంది 

  పెళ్లి ఊరేగింపులో బంధు మిత్రులందరూ వరుడు ముందుంటారు.
 అదే  శవయాత్రలో శవం ముందు ఉంటుంది బంధుమిత్రులు వెనుక ఉంటారు.

 అంటే మనుషులందరూ  సంతోషం వచ్చే దగ్గర ముందు ఉంటారు 
బాధ వచ్చే దగ్గర వెనుక ఉంటారు అని అర్థం.

 పాలు అమ్మేవాడు ఇల్లులు తిరిగి అమ్మాలి 
 అదే  వైన్ అమ్మే వాడు ఒకే దగ్గర ఉండి అమ్ముతాడు 
 ఎందుకంటే చెడు కి ఆదరణ ఎక్కువ కాబట్టి

 పండు తింటే అరిగిపోతుంది  తినకపోతే ఎండిపోతుంది
 జీవితం కూడా అంతే గడిపిన గడపక పోయినా కరిగిపోతుంది.

 అర్థం చేసుకుంటే  మనిషి పుట్టిన దగ్గర్నుంచి చచ్చేవరకు పోయే టందుకే మన ప్రయాణం.
 ఈ మాత్రం దానికి పుట్టడం ఎందుకు చావడం ఎందుకు.
 తెలుసుకోవడం లోనే ఉంది కిటుకంతా.

 మానవులుగా బతకడం కాదు మానవత్వంతో బతకాలి

అందరు బాగుండలి అందులొ మనముండాలిమనముండాలి..!






కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది