మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ' - మొదలుగా గల శ్లోకాల అర్ధం ఏమిటి?
ఈ నామాలు కుండలినీ యోగాన్ని సూచిస్తున్నాయి.
మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ - మూలాధార చక్రంలో ఉండి నువ్వు బ్రహ్మగ్రంధిని భేదిస్తున్నావు. మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధి విభేదినీ - మణిపూరక చక్రంలో ఉండి నువ్వు విష్ణుగ్రంధిని భేదిస్తున్నావు. ఆజ్ఞాచక్రాంతరాళస్తా రుద్రగ్రంధి విభేదినీ - ఆజ్ఞాచక్రంలో ఉన్న నీవు రుద్రగ్రంధిని భేదిస్తున్నావు. సహస్రారాంబుజారూడా సుధాసారాభివర్షిణీ - సహస్రార చక్రానికి చేరిన నీవు అమృత వర్షాన్ని కురిపిస్తున్నావు. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా - మెరుపుతీగలా నీవు ఆరు చక్రాలను దాటి ఆ పైన ఉన్న భూమికను చేరుకుంటున్నావు. మహాశక్తి కుండలినీ బిసతంతు తనీయసీ - నీవు మహాశక్తివైన కుండలినివి. దేహంలో ఉన్న అన్ని నాడులనూ నీవు అమృత వర్షంతో తడుపుతున్నావు.
ఈ నామాలన్నీ శ్రీవిద్యలో మూల సాధనైన కుండలినీ జాగృతినీ, చక్రభేదనాన్నీ, గ్రంధి భేదనాన్నీ, అమృతవర్షాన్నీ సూచిస్తున్నాయి. మనలో మూడు గ్రంధులున్నాయి. సాధనలో వీటిని భేదించడం జరుగుతుంది. ఈ ప్రక్రియే ఇక్కడ సూచింపబడింది.
"ఓం కామేశ బద్ధమాంగల్య సూత్రశోభిత కంధరాయై నమః" అనే నామాన్ని రోజు జపిస్తే త్వరగా వివాహం అవుతుంది
లక్ష్మి కటాక్ష ప్రాప్తి కోసం ప్రతీరోజు పాలలో కుంకుమపువ్వు, యాలకుల పొడిని కలుపుకుని త్రాగండి. శుక్రుడు కరునిస్తాడు. శుక్రగ్రహ దోష నివారణకు.