లలితాసహస్రనామ స్త్రోత్ర ఫలితం

లలితాసహస్రనామ స్త్రోత్ర ఫలితం




లలితాసహస్రనామ స్త్రోత్ర ఫలితం

లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

మనసుతో పలకాలి :-
లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి.
పద్మపురాణంలో విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి కనుక లలిత అని వర్ణింపబడింది. రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి, చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన లోకమాత లలిత.
ల – సర్వవిద్యలకు లక్ష్యమైనది,
లి – రూపము లేనిది,
త – సంసారం నుండి తరింపజేయునది, శ్రీలలిత.

🕉ఓం శ్రీమాత్రేనమః !🕉




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది