జీవితం అనే యుద్ధంలో





జీవితం అనే యుద్ధంలో

మనం జన్మించక ముందు నుంచే మన యుద్ధం అనేది మొదలవుతుంది

క్రోమోజోములు అండం ఫలదీకరణం లో లో బాగా ఘర్షణ వాతావరణం ఏర్పడి ఒక చిన్న అణువు లాగా తయారవుతుంది

తరువాత అనేక వేల సూక్ష్మజీవులతో యుద్ధంతో తలపడుతూ రోజుకొక శరీర భాగాలను గెలుస్తూ

మనం ఒక్క రాజ్యాన్ని గెలిచినట్లు ఒక్క జీవి లాగా తయారు అవుతాము

తరువాత ఇన్ని యుద్ధాలు చేసిన తర్వాత మనం ఒక మనిషి లాగా యుద్ధం గెలిసి బయట వాతావరణానికి వస్తాము

ఈ జగత్తు కి వచ్చిన తర్వాత

మొదటి రోజు నుంచి తల్లి ఎక్కడ ఉందో అని ఏడుపు అనే యుద్ధం చేసి తల్లి వాటి స్థానాన్ని గెలుచుకుంటామ

ఆ తరువాత రోగనిరోధక శక్తి తో నిరంతరం యుద్ధం చేస్తూ

మన మన రోగనిరోధక శక్తిని పెంపొందించు కుంటాము

బాల్యం దశలో మనకి అర్థం కాని ఘర్షణ వాతావరణం లో

వాతావరణాన్ని తట్టుకుంటూ యుద్ధం చేస్తూ మనల్ని మనం వాతావరణానికి అలవాటు అయ్యేటట్లు చేసుకుంటాము

తరువాత చదువుకునే దశలో సరిగా అర్థం కాకపోయినా పుస్తకాలతో పోటీపడుతూ

పుస్తకాల్లో ఉన్న అక్షరాలను యుద్ధం చేస్తూ జ్ఞానం సంపాదించుకున్నాను

మనకి ఒక ఆట మీద ఉన్న ఇష్టంతో మన శరీరానికి మరియు ఆట మీద ఉన్న ఇష్టంతో

శక్తి అనే వ్యవస్థతో ఘర్షణ పడుతూ ఆట అనే యుద్ధం గెలుస్తాము

మన బాల్యంలో లో మంచి చెడులను మన సహచరులకు పంచుకుంటూ వాళ్ల హృదయంలో యుద్ధం చేసి ఇ స్నేహం అనే రాజ్యం గెలుచుకుంటామ

యవ్వన దశలో ఒక ఆమె లేదా అతను ఆకర్షణతో ఘర్షణ చేస్తూ చేస్తూ ఒకరి మనసు ఒకరు యుద్ధం చేస్తూ

ప్రేమను గెలుచుకుంటారు

మన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఒక బలిష్టమైన ఘర్షణ వాతావరణం లో  మంచి చెడులు అనే యుద్ధంలో

ఒక చక్కటి కుటుంబం కుటుంబ రాజ్యం నీ గెలుచుకుంటామ

కుటుంబ భారాన్ని మోయడానికి అనంతకోటి విశ్వంలో కి వెళ్లి మనకి రానిది కూడా ఒక యుద్ధం లా చేస్తూ కర్షకుడి లా ఒక ఘర్షణ వాతావరణం లో

సాయశక్తులా కృషి చేసి

కుటుంబ పోషణకు కావాల్సిన ధనము అనే రాజ్యాన్ని గెలుస్తాము

మనసుకి మెదడుకి మధ్య జరిగే కర్షణ వాతావరణంలో రోజు యుద్ధం జరుగుతూ మదనపడుతూ ఉంటాము

ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎలా అనుకుంటుందో తెలియదు ఎవరు అంటే ఇస్తారో తెలియదు

ఏ వస్తువు ఎక్కడి నుంచి యుద్ధానికి పురికొల్పుతుంది దో తెలియదు కానీ నీ ప్రతి దాడి చేసినట్టు మనకి కరోనా సోకుతుంది దానితో మనం రోజు పోటీపడి మన అవయవాలతో ఘర్షణ కొనసాగించి

మందులతో ఆ కరోనా వ్యాధి ని తిప్పికొట్టి ఇ యుద్ధం గెలవాలి మన మనోధైర్యంతో

వృద్ధాప్యంలో దశలో ఎప్పుడు పోతామో తెలియక మనకి అనేక రకమైన జబ్బులు అంటుకొని వాటితో నిత్యం పోటీపడుతూ మన భార్య పిల్లలు సూటిపోటి మాటలతో ఘర్షణ వాతావరణంలో మన బతుకు బండిని గెలిచాము అనుకొని ప్రతినిత్యం యుద్ధం చేస్తూ  మరణిస్తా ము

మన జీవితంలో డబ్బు కోసం ఒక మనిషి కోసం ఒక స్థలం కోసం ఒకరి మనసులో స్థానం సంపాదించుకోవడం ఒక హోదా కోసం రోజు ఘర్షణ వాతావరణం లో ప్రతి నిత్యం యుద్ధం చేస్తూ ఏదో సాధించాము అని అనుకుంటూ
ఇంకా ఏదో సాధించాలి అనుకుంటూ మరణం యుద్ధంతో ఓడిపోతామ




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది