నేటి వార్తలు (07.02.2021) - పుష్య మాసం దశమి ఆదివారం





*నేటి వార్తలు (07.02.2021)*
*పుష్య మాసం దశమి ఆదివారం*

స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు *పి.సుదర్శన్ రెడ్డి జయంతి* 

తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు *వేటూరి ప్రభాకరశాస్త్రి జయంతి*

అమెరికన్ దౌత్యవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత *ఎలిహూ రూట్ వర్ధంతి*

 స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు,చలనచిత్ర దర్శకులు *ఆమంచర్ల గోపాలరావు వర్ధంతి*

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటలలో 11,713 కరోనా పాజిటివ్ కేసులు,95 మంది మృతి

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో దుబాయ్‌లో మృతి చెందిన తెలంగాణ వాసి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.

మంత్రి ఎర్రబెల్లితో ఉద్యోగ సంఘాల భేటీ.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరిన నాయకులు

భారత న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజా పక్షమే.. గుజరాత్ హైకోర్ట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ

వృద్ధులకు మార్చిలో కరోనా వ్యాక్సినేషన్.. అవసరమైతే నిధులు పెంచుతాం: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మహిళా కమెండోలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

తన అహంకారం వల్లే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలను అమలు చేయలేదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2 వరకు సమయమిచ్చామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు

బీహెచ్ఈఎల్ మరో ఘనత.. మధ్యప్రదేశ్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్‌క్రిటికల్‌ ప్లాంట్‌

తెలంగాణ డీజీపీకి కోవిడ్‌ టీకా.. టీకాపై అనుమానాలు, ఆపోహాలు అక్కర లేదన్న మహేందర్‌రెడ్డి

కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాలి, కంపెనీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ సూచన

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వెళ్లగక్కారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలతో రైతులకే కాదు యావత్ దేశానికే ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు

దేశవ్యాప్తంగా రైతుల ‘చక్కా జామ్’.. చెదురుముదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతం

రైతులు వ్యవసాయం కోసం తీసుకునే లోన్ ప్రక్రియ కేంద్రం సులభతరం చేసింది. ఇందుకోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని.. పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీంతో అనుసంధానం చేసింది.

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫుల్‌ సెక్యూరిటీ.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఆర్థిక రాజధాని ముంబైలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో శుక్రవారం చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. డంప్ యార్డ్‌లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 19 అగ్నిమాపక దళాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు

మేడిన్ ఇండియా వ్యాక్సిన్ కోసం క్యూ‌లో 25 దేశాలు’ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడి.

ప్రధాని నరేంద్ర మోదీ అన్న కూతురు సోనల్ మోదీకి భంగపాటు, అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వని బీజేపీ

బెంగాల్‌లో మార్పు అనివార్యం, అవినీతితో ప్రజలు విసుగెత్తిపోయారు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూలోని చనపోరా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. శనివారం అనూహ్యంగా కాల్పులు జరిపారు. దీంతో ఓ కానిస్టేబుల్‌ గాయాపడ్డాడని పారామిలిటరీ ఫోర్స్‌ అధికారి ఒకరు తెలిపారు

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో వడివడిగా సాగుతోంది. శనివారం నాటికి వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 50 లక్షల మార్కును దాటింది.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది