నేటి వార్తలు (05.02.2021) - పుష్య మాసం అష్టమి శుక్రవారం





*నేటి  వార్తలు (05.02.2021)*
*పుష్య మాసం అష్టమి శుక్రవారం*

ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు *గరికపాటి రాజారావు జయంతి* 

 బుర్రకథ పితామహుడు *షేక్ నాజర్ జయంతి* 

 రచయిత, ప్రజా ఉద్యమనేత *వట్టికోట ఆళ్వారుస్వామి వర్ధంతి* 

 అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు *ఎ.జి.కృష్ణమూర్తి వర్ధంతి*

భారత్ లో తాజాగా గత 24గంటల్లో బుధవారం 12,899 కరోనా కేసులు,107 మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,93,061 పాజిటివ్ కేసులు,14265 మంది మృతి

తమిళనాడు నామక్కల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, 10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా

తెలంగాణలో పోలీసుల స్టైల్ మార్చనున్నారు. ఇకపై శృతి మించితే  లాఠీలకు పనిచేపనున్నారు.  రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడుల నేపధ్యంలో పొలిసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది

జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు,  ప్రవేశపెట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

భిన్నాభిప్రాయాలున్నా కలిసికట్టుగా ఉందాం, రైతులు దేశంలో అంతర్భాగమే విరాట్ కోహ్లీ

71వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు.. ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

మరోసారి వెలుగులోకి వచ్చిన చైనా ఆరాచకాలు, జిన్‌జియాంగ్‌లో మైనార్టీ మహిళలపై అఘాయిత్యాలు, బయటపెట్టిన బీబీసీ

ఆన్‌లైన్‌ రుణయాప్‌లపై హైకోర్టు ఆగ్రహం,  రుణ యాప్‌లను బ్లాక్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై రాష్ట్ర సర్కార్ కసరత్తు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

కరోనా వ్యాక్సినేషన్‌,  సురక్షితంగా సేవలందించేందుకు వీలుగా పోలీసులకు రెండో దశ కోవిడ్‌ టీకా

రైతులే మన దేశానికి వెన్నెముక, చౌరీ చౌరా శతాబ్ధి ఉత్సవాల్లో ప్రధాని మోదీ

పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే, రాజ్యసభలో డిమాండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌

సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, ఆటో – జీపు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి

పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా మూడో రోజు వ్యవసాయ చట్టాలపై రగడ కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య మరోసారి లోక్‌సభ వాయిదా పడింది

తెలంగాణలో వీడని చిరుతపులి భయం. పంజా విసురుతున్న రక్తం రుచిమరిగిన పులులు

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా మోదీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. ప్రపంచ స్థాయి బ్యాంకుల ఏర్పాటు లక్ష్యంతో ఇప్పటికే బ్యాంకుల విలీనాలకు తెరతీసిన కేంద్రం

అనంతపురం జిల్లాలో విషాదం.. బోల్తాపడిన ట్రాక్టర్, పదిమందికి పైగా గాయాలు

ఇరాన్ దేశ సైనికులు పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ చేసి తమ గార్డులను విడిపించుకుంది. 

ఎంపీ, ఎమ్మెల్యేల క్రిమినల్‌ కేసుల విషయంలో తాము జోక్యం చేసుకోలేం, స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

ఫిబ్రవరి 13 నుంచి ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ రెండో డోసును అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు

గౌలిపురలోని శ్రీనివాస హైస్కూల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమయానికి స్థానికులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో స్కూల్లో 50 మంది విద్యార్థులు పాఠశాలలో ఉండగా, వారందరూ.. సురక్షితంగా బయటపడ్డారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది