నేడు పోరాడి గెలిచినా
రేపు మళ్ళీ నిలిచినా
ఎల్లుండి తప్పించుకున్నా
మరో రోజు తిప్పించుకున్నా
చివరకు గెలిచేది మరణమే
కాలే కట్టే నిండే మన్ను
కలచిన హృదయాలు
కురిసిన కన్నీరు
ఎంత పోరాడినా చావు చెంత గెలిచినవాడేడి
పోయావా అంటూ రోదన
మరల రావా అనే వేదన
ఇక పై ఎలా అనే శోధన
మన పిచ్చి కాకపోతే...
మన వంతూ వస్తుందనే గుర్తురాని భావన
కాలిపోయాక అందం ఏమైంది
వీడి పోయాక బంధం ఏమైంది
ఇంకో గంట ఉండు, మరో రోజు ఉండు, ఎప్పటికీ ఉండిపో...
ఆహ ఏమి బంధాలు, బతికున్నప్పుడే సొంతాలు
వీడిన మరు క్షణం ఏడుస్తూనే
ఎప్పుడు కాల్చేస్తామా పూడ్చేస్తామా అనే ఆలోచన
కొడుకు కూతురు, మొగుడు పెళ్ళాం
మిత్రుడు శత్రువు, పక్కింటోడు ఎదురింటోడు
ఆఫీసు ఇల్లు,
కాలేజి మ్యారేజీ
బండి, ఫోను,
డబ్బు, లోను
సినిమా టీవీ,
పొగరు ఠీవి
నవ్వు ఏడుపు ,
పన్నీరు కన్నీరు ,
సరదా చిరాకు,
శ్రద్ధ పరాకు
ఫ్యాను లైటు,
బిర్యానీ షేర్వాణీ,
క్రికెట్టు టెన్నీసు, రిబ్బను పిన్నీసు,
రాజకీయం, శృంగారం, వ్యామోహం,ప్రేమ, కుటుంబం, బంధుప్రీతి,
ఆస్తులు లావాదేవీలు, కోర్టులు కస్టాలు,సుఖాలు, లాభాలు నష్టాలు, బాధలు బంధాలు, బరువులు బాధ్యతలు,
ఈర్ష్యలు అసూయలు,
గెలుపు ఓటమి,
పొగడ్త తెగడ్త, కోరికలు,అలకలు,మోసాలు, సేవలు, భక్తి ,రక్తి,ముక్తి,
ఇవన్నీ జీవితం లో మనం చేసే డూపు, నటన....
పుట్టుక తో చావొక్కటే నిజమైన నేస్తం !!!!ఇదే కఠినమైన వాస్తవం !!!
అంతిమ గమ్యం !!!!!!