ఏ మహాకవి రాశాడో తెలియదుగాని పంపిస్తున్నా..ఈక్రింద పొందు పర్చిన కవిత్వం.... నావరకూ రావడం నాఅధృష్టంగా భావిస్తున్నా .... మీవరకూ చేర్చడం నాభాద్యతగా బావించి పంపిస్తున్నా..
*************
"నా దేశం మారుతోంది"
నిన్న GST, మొన్న డిమానిటైజేషన్, ఆవలి మొన్న స్వచ్ఛ భారత్.....
అన్నీ చారిత్రక ఘట్టాలే ... ఎవరూ ఉహించని విప్లవాలే
ఇక్కడ అమ్మాయిలు మొబైల్లలో టైం తింటున్నారు ....
అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటున్నారు ...
పోలీసులు లంచం తింటున్నారు....
నేతలు గడ్డి తింటున్నారు..
కానీ...రైతులు విషం తింటున్నారు..
జవాన్లు తూటాలు తింటున్నారు ...
నా దేశంలో ఇంకా ఆకలి ఉంది అని ఎవరు అన్నారు.....
"నా దేశం మారుతోంది"
ఈడ చీపురు పట్టినోడు డిల్లీ సిఎం కాగలడు
టీ అమ్మినోడు పి.ఎం. కాగలడు ...
డిగ్రీలు,డిప్లొమాలు చేసినోళ్ళంతా...ఫేస్ బుక్ వాట్స్ అప్ లో బిజీగా ఉంటారు....
ఇంకా నా దేశం లో నిరుద్యోగం ఏడుంది....?
"నా దేశం మారుతోంది"
జపాన్ వాళ్ళు 7జి ట్రైల్స్ వేస్తున్నారు
మనోళ్ళంతా 11 గ్రూపుల్లోకి సాయిబాబా అని పంపి ఫ్రీ రీచార్జ్ కోసం ఎదురుచూస్తున్నారు ...
"నా దేశం మారుతోంది"
మా దగ్గర అగర్ బత్తులు రెండు రకాలు ....
ఒకటి దేవుడి కోసం ...
ఇంకోటి దోమల కోసం ...
కాని వాటి వాసనకి దేవుడు రాడు,
వీటికి దోమలు పోవు
"నా దేశం మారుతోంది"
కడుపు మాడిపోతుంది అయినా యోగ చేయిస్తున్నారు ....
జేబుల్లో చిల్లి గవ్వ లేదు అయినా బ్యాంకు లో ఖాతా తెరిపిస్తున్నారు ....
తలదాచుకోవడానికి గూడు లేదు కాని లెట్రిన్ కట్టిస్తున్నారు ....
ఊళ్ళల్లో కరెంటు లేదు కాని డిజిటల్ బాట పట్టిస్తున్నారు ....
మనం కులం కంపులో దొర్లుతున్నాం ...
రోడ్డు కంపుల్లో స్వచ్ఛ భారత్ అంటున్నాం ....
మన గోవులు హైవేల మీద చస్తున్నాయి,
మనోళ్ళు గోరక్షణ కోసం చంపుతున్నారు ...
డేటా ధర తగ్గుతుంది .. టమాట ధర పెరుగుతుంది
ఇప్పటికైనా అర్ధం అయ్యిందా ....
"నా దేశం మారుతోంది"
ఇది నేటి భారతావని...
ఒక యువ జర్నలిస్ట్ కలం నుండి జాలువారిన అక్షర కావ్యం. . .
*************