గుడ్డు పౌష్టికాహారం-అందరికి అవసరం





🌐🥚🍳➖➖➖➖➖➖➖➖
*నేడు..వరర్డ్ ఎగ్ డే.
➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
'గుడ్డు పౌష్టికాహారం-అందరికి అవసరం'

*★గుడ్ల వాడకాన్నీ , దానిలొని ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు తెలియజెప్తూ ప్రతియేట అక్టోబరు రెండో శుక్రవారము నాడు " వరర్డ్ ఎగ్ డే " నిర్వహిం చడం జరుగుతుంది.*

*■  ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌ (ఐ.ఇ. సి) ప్రపంచములోగల ప్రజలమధ్య అనుసంధానం ఏర్పరిచే ... ప్రపంచ గుడ్ల పరిశ్రమకు ప్రాతిని ధ్యం వహించే ఏకైక సంస్థ. విభిన్న సంస్కృతు లు , జాతీయతల నడుమ సంబందాలు అభివృద్ధిపరిచే సమాచారము తెలియజెప్పే అసాధారణ కమ్యూనిటీ ఇది. ఐఇసి గుడ్ల ఉత్పత్తి పోషకా లు , మార్కెటింగ్ లకు సంబంధించిన తాజాపరిణామాల్ని పర్యవేక్షణ  చేస్తూంటుంది.1996 లో వియన్నా లో జరిగిన ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్‌ సదస్సు లో అక్టోబర్ రెండో శుక్రవారము నాడు " వరర్డ్ ఎగ్ డే" నిర్వహించాలని ప్రకటించారు.*

■  దేశ జనాభాలో 25శాతంగా ఉన్న పట్టణ ప్రాంత ప్రజలు ఏటా సగటున 100 కోడిగుడ్ల ను వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల లోని ప్రజలు ఏటా సగటున 20 గుడ్లు మాత్రమే వినియోగిస్తున్నారు.ఇది ఇంకా పెరగ
వలసిన అవసరం వుంది.

■గుడ్డును పలు రూపాలలో ఆహారముగా తీసుకుంటారు.పచ్చి గుడ్డుసొనను నోటిలో పోసుకొని మింగడము ,గుడ్డును ఉడికించి తినడం ,ఉడికించిన గుడ్డు బ్రెడ్ ని కలిపి టోస్ట్ గా తీసుకుంటారు. గుడ్డును పలావు లో , బిర్యానిలో రుచికోసము వాడుతారు ,బేకరీ లలో గుడ్డును వాడుతారు ,గుడ్డు ఆమ్లెట్ , బుల్స్ ఐ , ఎగ్ ఫ్రై ... కూరగా వాడుతారు.

■ఏ ఒక్క వయసుకో మితమైన ఆహారము కాదు గుడ్డు. బాల్యము నుండి వృద్దాప్యము వరకు అన్ని వయసులలో స్త్రీ పురుషులు బేదము లేకుండా గుడ్డును తీసుకుంటారు. గుడ్డుమీద జరుగుతున్న పరిశోధనలు ఏటా కొత్త ఫలితాలను ఇస్తువున్నాయి. గుడ్డు ను తీసుకోవాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెబుతున్నారు. ఉదయము అల్పాహారంతో గుడ్డు తీసుకోవడము మంచిదని తాజా అధ్యయనములో తేలినది. గుడ్డులో సొన శక్తినిస్తుంది. శరీరంలొ ప్రతి అవయవము మీద ప్రభావము చూపుతుంది. గుడ్డును  శాకాహారముగా ప్రకటించి అందరికీ గుడ్డు అందించాలనే ఉద్యమము ఇటీవలి కాలం లో ఊపందుకుంది .

*🌟గుడ్డు ద్వారా : మనకందే పోషకాలు..*
క్యాలరీలు : 70-80 , 
ప్రోటీన్లు : 06 గ్రాములు ,
క్రొవ్వులు : 05 గ్రాములు ,
కొలెస్టిరాల్ : 190 గ్రాములు
నీరు : 87%.

*🌟గుడ్డు వల్ల ఉపయోగాలు..*

*🍄మంచి చేసేవి:*
*✧గుడ్డు పౌస్టికాహారము.. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఇందులో ఉంటాయి , పిల్లల పెరుగుదలకు మంచిది . కూరగా వాడుకోవచ్చును.కోడి గుడ్డు తింటే దృస్టికి ఎంతో మేలు కలుగుతుంది ..*

*✧ రోజు గుడ్డు తినేవారికి శుక్లాలు వచ్చే అవకాశము బాగా తగ్గుతుంది ,గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది.*

*✧ సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది.కాబట్టి డైటింగ్ లో ఉన్నవారు గుడ్డును తీసుకోవచ్చు ,బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది.*

*✧ గుడ్డులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారము తీసుకోనివ్వ దు.. పరిమిత ఆహారము తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు.*

*✧ గుడ్డు తినటం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమేనని ఒక అధ్యయనము వల్ల తేలినది.వాస్తవంలోగుడ్డు  తినేవారిలో రక్తనాళాలు మూసుకుపోవటం లేదా గుడెజబ్బులు రావటం బాగా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.*

*✧ మెదడుకు ఆరోగ్యాన్నిచ్చేపదార్దాలు గుడ్డు లో ఉన్నాయి. గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాము లు " కోలిన్‌ " అనే పోషక పదార్థం ఉంది ... ఇది మెదడుకణాల ఆరోగ్యాన్ని కాపాడుతుం ది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగు పరుస్తుంది, మెదడునుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ పాత్ర వహిస్తుం ది.*

*✧ గుడ్డు లో ఉన్న ఐరన్‌ శరీరము చాలా సులభంగా గహిస్తుంది. అలా గ్రహించేరూపం లో ఐరన్‌ ఉన్నందున గుడ్డు గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.*

*✧ గుడ్డు ను ఆహారము గా తీసుకోవటానికి , కొలెస్టరాల్ కి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి రోజూ రెండు కోడి గుడ్లు తీసుకునే వారికి లైపిడ్సు లో ఎటువంటి మార్పు లేకపోవడం గమనించారు. పైగా గుడ్డు వలన శరీరానికి మేలు చేసే కొలెస్టిరాల్ పెరుగుతుందని తేలింది.*

*✧ స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకి ఉందని తేలినది. ఒక అద్యయనం లొ వారములో 6 రోజులు గుద్దును ఆహారము గా స్త్రీలకు ఇచ్చారు.. అటువంటి వాళ్ళలో రొమ్ము క్యాన్సర్ బారినపడే అవకాశము 44 శాతము తగ్గినట్లు తేలినది.*

*✧ గుడ్డు వలన శిరోజాల ఆరోగ్యము మెరుగ వుతుంది. గుడ్డులొ ఉన్న సల్ఫర్ , పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది.*

*✧ గుడ్డులో పలురకాల లవణాలు , అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్, అయోడిన్‌ , సెలీనియం , ఐరన్‌ , జింక్ లు ఉన్నాయి.. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే.*

*✧ గుడ్డు లోని ప్రోటీన్ల వల్ల యవ్వనములోని కండరాలకు బలము , చక్కని రూపము యేర్పడుతుంది.*

*✧గుడ్డులో ఉండే విటమిన్‌ ఏ ఆరోగ్యకర మైన కణాల వృద్ధికి, చర్మం, కళ్లకు, వాటి కణజాలానికి ఇది ఎంతో అవసరం.*

*✧విటమిన్‌ బి12 ఎర్ర రక్తకణాల తయారీకి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి, మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.*

*✧ ఆరోగ్యకరమైన ఎముకలు, పళ్ల నిర్మాణా నికి, శరీరానికి అవసరమైన కాల్షియాన్ని అందిస్తుంది.*

*🍄నష్టము చేసేవి:*

*ㅁగుడ్డును బాగా ఉడికించి అందులోని బాక్టీరియాను పూర్తిగా సంహరించబడేలా చూసుకోవాలి . బాక్టీరియా వల్ల శరీరానికి నస్టము జరుగుతుంది.*

*ㅁపచ్చి గుడ్దు తినడం మంచిదికాదు . తెల్లసొనలో " ఎవిడిన్‌ " అనే గ్లైకో పోటీన్‌ ఉన్నందున అది బి విటమిన్‌ ను శరీరానికి అందనీయకుండా చేస్తుంది.*

*ㅁ కొలెస్టిరాల్ జబ్బులతో బాధపడుతున్న వారు గుడ్డును తీసుకొరాదు.*

*ㅁటైప్ 2 డయాబిటీస్ ఉన్నవారిలో గుడ్డు ను వాడరాదు. రిస్క్ ను ఎక్కువ చేస్తుందని రిపోర్టులున్నాయి.*

*ㅁ కొంతమందిలో ఫుడ్ ఎలర్జీ కలిగే అవకాశా లు ఎక్కువగా ఉన్నాయని అద్యయనాలు ఉన్నాయి.*

*ㅁ కొన్ని యాంటిబయోటిక్స్ మందులు ఉదా. సెఫలొస్పోరిన్స్ ... గుడ్డు వాడేవారిలో పనిచేయక పోవచ్చును, యాంటిబియోటిక్ రెసిస్టెంట్.*

*ㅁగుడ్డు కంపును భరించలేము...  వాతావర ణ వాసన కాలుష్యం...*

..పిల్లల నుంచి పెద్దల దాకా "గుడ్డు పౌష్టికాహారం" అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎదిగే పిల్లలకు చాలినన్ని పొటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడే వారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు.

              🍃🌸🤗🌸🍃





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది