* అమృతాన్ని వర్షించు *అమ్మ* యను మాట మరచి,
మృతశరీరాన్ని స్ఫురింపజేసే *మమ్మీ* యను మాట నేర్చిరి!
* *నాన్నా!* యనగ, ప్రేమమీరగ విశ్వమంతను చూపే తండ్రిని,
*డ్యాడ్* అంటూ బ్యాడ్ గా డమ్మీని చేసిరి!
* అమ్మా నాన్నల ప్రేమ కలగలపిన *అన్న* ను,
*బ్రోదర్*అంటూ బరువూ బాధ్యత లేనివానిగ మార్చిరి!
* *తమ్ముడూ!* అను మురిపాల పిలుపునకు కూడా, *బ్రోదర్ ఒకటే పదం* అంటూ సెలవిచ్చిరి!
* *అక్కా!* యనగ, అవ్యాజానురాగమైన ప్రేమను అనంతంగా కురిపించు
అమృతమూర్తిని, *సిస్ టర్* అంటూ మిస్ చేసిరి!
* *చెల్లీ!* యనగా, కష్టాల్లో నాకంటూ తోడుగా నా అన్న వున్నాడంటూ
భ్రమించే చెల్లికి కూడా, *సిస్ టర్ ఒకటే పదమే* అంటూ సొద పెట్టిరి!
* సంస్కారాన్ని తెలిపే *నమస్కారాన్ని*,
*హెలో!, హాయ్!* అంటూ జాయ్‌గా ఎంజాయ్‌గా మార్చిరి !
సంస్కృతీ సంబరాలను మరచి, *తల్లుల రోజు, తండ్రులరోజు, ప్రేమికుల రోజు,ఆంగ్ల సంవత్సరాది* విందుల మత్తులో మునిగితేలిరి?
* *సుమతి* లోపించి, *వేమన* ను మరచి, తెలుగున సంభాషించు వాడిని చిన్నచూపు జూచి, ఆంగ్లము అరకొరగా, అస్తవ్యస్తముగా పలికినా, చిలక పలుకులని భ్రమించసాగిరి?
* వేయి మాటలేల, అత్తకు పిన్నమ్మకు *ఆంటీ*, మామకు పెద్దయ్యకు *అంకుల్*,అంటూ
బోడిగుండుకు మోకాలికి ముడి వేసినట్లుగా, ఒక్కొక్కటే పదమనిరి.
* అక్షరాలు తక్కువై, ఇఛ్ఛానుసారం పదాలను పొందుజేసి, పెంపొందింపజేసిన ఎంగిలిభాష, విశ్వభాష యెట్లయ్యనో?
*సుధామధురిమలొలుకు పరిపూర్ణ అమృతఘటము వంటి తేట తెనుగు*,
*విశ్వము నుండి కనుమరుగు యెట్లు కాజొచ్చెనో?*
*యెంత ఆలోచించినను, అవగతం కాకుండె వినర తెనుగు రాయుడా!!*
*తెలుగుభాషాభిమానులైన మాన్యులందరకీ వందనం, శుభాభినందనం.