🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼
" సహనం "
వస్తువులను వాడుకోండి....
మనుషులను ప్రేమించండి...
ఈ కథ నిజంగా జరిగిన వాస్తవం...
ఒక వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటుండగా , అతని ఐదేళ్ల కూతురు అక్కడికి వచ్చింది... చేతికందిన రాయి తీసుకుని కారుకి ఒకవైపు గీతలు గీసేసింది...కోపం పట్టలేని ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చిన్నారి పాపని కిందకి తోసేశాడు...అంతేకాకుండా ఆ తప్పుకి శిక్షగా ఆ చిన్నారి చేతుల మీద చితక్కొట్టేశాడు...
కాసేపటికి కోపం తగ్గాక , ఆ తండ్రి తన కూతురిని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తాడు...అక్కడి వైద్యులు చాలా కృషి చేశారు...కానీ , తండ్రి కొట్టిన దెబ్బలకి చిన్నారి చేతి వేళ్ళు ఎంతలా దెబ్బ తిన్నాయంటే , ఆమె రెండు చేతుల వేళ్లని తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు...
శస్ర్త చికిత్స పూర్తయింది... ఆ పాపాయి రెండు చేతులకి కట్లు కట్టేశారు...మెలకువ వచ్చాక పాపాయి అమాయకంగా చెప్పింది " నాన్న నీ కారు పాడు చేశాను ...నన్ను క్షమించు " ...అంతేకాదు ఆ తర్వాత ఇంకా ప్రశ్నించింది " నా వేళ్ళు మళ్లీ ఎప్పటికి పెరుగుతాయని " ...
ఈ ప్రశ్నకి జవాబులేదా తండ్రి దగ్గర , నోట మాట లేని స్థితిలో , తన మీద తనకే అసహ్యం పడుతుంటే , కారు దగ్గర కెళ్లి ఎడా పెడా తన్నడం మొదలెట్టాడు...
తనేం చేస్తున్నాడో తనకే అర్థమయ్యేసరికి నిస్ప్రహ ఆవరించింది...కారు ముందు కూలబడిపోయాడు...అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్లలోంచి చూస్తుంటే మసకమసకగా అక్షరాలు కనిపించాయి... కారు మీద కూతురు గీసిన గీతలు అవేనని అర్థమయ్యేసరికి , అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతివేళ్ళు పొగొట్టానన్న సంగతీ మనసుకి తెలిసేసరికీ ఆ తండ్రీ మనసు చెదిరిపోయింది ...ఇంతకీ ఏం రాసిందంటే...
* DADDY I LOVE YOU *
ఆ మర్నాడే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు...
#ఆచరించే ముందు ఆలోచించండి ...సహనం కోల్పోవద్దు....
#క్షమించి మరచిపోండి ...అందరినీ ప్రేమించండి ...ఆదరించండి.