🌋🌋🌋🏡🏡🏡🌋🏡🏡🏡🌋🌋🌋
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ఈ రోజు సద్గురువారం, దీపావళి పర్వదినం
☣నీటి తోదీపాలనువెలిగించిన సాయిబాబా ☣
సాయి చరిత్రలోని ఈ ఘట్టమును ఒకసారి
స్మరణ చేసుకుందాం ఈ శతాబ్ది సం॥లో ....
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
⛳⛳⛳⛳
ఒకరోజు ఎవరూ ఊహించని విధంగా షిరిడీని వర్షం ముంచెత్తింది. మర్నాటికి తగ్గుతుందని అనుకున్నారంతా. లేదు. మర్నాడు, ఆ మర్నాడు అలా వారం రోజులు పాటు వర్షం కురుస్తూనే ఉంది. ముసురు పట్టింది. బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. మహల్సాపతికి, శ్యామాకి బాబా గురించి దిగులు పట్టుకుంది. వేపచెట్టు కింద బాబా ఎలా ఉన్నారో? ఏమయిపోయారో?ముసురు తగ్గింది. సన్నగా చినుకులు పడుతున్నాయి. బాబా కోసం మహల్సాపతి, శ్యామా వేపచెట్టు దగ్గరకి బయల్దేరారు. ఊరంతటా వరద ముంచెత్తుతోంది.
నీటిలో నడవడం కష్టంగా ఉంది. మోకాలి లోతు నీటిలో నడిచి నడిచి అతి కష్టమ్మీద బాబాని సమీపించారు. చూస్తే బాబా అదేదీ పట్టించుకోనట్టుగా ధ్యానంలో ఉన్నారు. నిండుగా తడిసిపోయి ఉన్నారు. ఆయన్ని ఒరుసుకుంటూ నీరు ప్రవహిస్తోంది.‘‘బాబా’’ పిలిచాడు మహల్సాపతి. కళ్ళిప్పి చూశారు బాబా.‘‘ఈ వర్షంలో ఈ చెట్టు కింద ఎలా ఉన్నావు బాబా?’’‘‘అలాగే ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉండాలనీ, ఈ ముసురు తగ్గిపోవాలనీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’ అన్నారు బాబా.‘‘అల్లా మాలిక్’’ అంటూ ఆకాశం కేసి చూశారు. అప్పటికే అనేక మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అందరికీ బాబాని గురించిన ఆందోళనే!‘‘ఇక ఈ చెట్టు కింద మీరు ఉండవద్దు బాబా, పదండి, అదిగో అక్కడ మసీదులో ఉందురుగాని. పదండి.’’ అన్నాడు మహల్సాపతి.కటి ముసురుకుంటోంది. దీపాలు వెలిగించాలి అన్నాడు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
నీటి తోదీపాలనువెలిగించిన సాయిబాబా
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
నూనె కోసం బజారుకి వచ్చారు బాబా. ప్రేమ్చంద్ దుకాణం ముందు నిల్చుని నూనె కోసం చేతిలోని డబ్బాని అతని ముందు ఉంచారు. ఆ డబ్బాలో నూనె పొయ్యడం ఇష్టం లేదు ప్రేమ్చంద్కి. ఆ మాట కూడా చెప్పడం ఇష్టం లేదు. నౌకర్ని కేకేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. నౌకరు వచ్చాడు. అతని ముందు డబ్బాని ఉంచారు బాబా.‘‘దుకాణంలో నూనె లేదు బాబా! నిండుకుంది.’’ అన్నాడు నౌకరు. గట్టిగా చెప్పాడు. అబద్ధం ఆడుతూ వణికిపోయాడతను.‘‘లేదని అయ్య చెప్పమన్నాడు సామీ.’’ అన్నాడు మెల్లగా. చేతులు జోడించాడు. నవ్వుతూ తలాడించి ముందుకు కదిలారు బాబా. పక్కనున్న దుకాణంలోని గోపీచంద్ ముందు డబ్బాను జాపారు.‘‘ఎళ్ళెళ్ళు, నూనె లేదు.’’ అన్నాడు గోపీచంద్. నిండుగా నూనె ఉంది. కనిపిస్తోంది. అయినా లేదంటున్నాడు. సరే అనుకున్నారు బాబా. అక్కణ్ణుంచి మరి కొంచెం ముందుకు వచ్చి, మరో దుకాణదారు ముందు డబ్బాని ఉంచారు. అక్కడా అదే సమాధానం.‘‘నూనె లేదు.’’అందరూ ఒకటే మాట! అర్థమయింది బాబాకి. నవ్వుతూ వెను తిరిగారు. మసీదుకి చేరుకున్నారు.‘‘నూనె ఇస్తే దీపాలు వెలిగించడం కాదు, నూనె ఇవ్వలేదు, దీపాలు వెలిగించమను చూద్దాం. నూనె లేకుండా దీపాలు వెలిగించగలిగితే అప్పుడు బాబా నిజంగా దేవుడే!’’ అన్నారు వ్యాపారులు.‘‘అడిగింది ఇస్తూ పోతూంటే అంతా దేవుళ్ళే!’’ అని నవ్వుకున్నారు.‘‘ఈ చీకట్లో మసీదులో బాబా ఎలా ఉన్నదీ చూద్దాం, పదండి.’’ అనుకున్నారు వ్యాపారులు. బయల్దేరారు అక్కడికి.ప్రమిదలు తుడిచి మరీ సిద్ధం చేశాడు శ్యామా. వరుసగా గోడ మీద ప్రమిదలు పేర్చాడు.
నూనెతో బాబా వస్తే వత్తులు వేసి, దీపాలు వెలిగించాలి. ఆ పని బాబా చూసుకుంటారు. ఖాళీ డబ్బాతో వచ్చిన బాబాని చూశాడు శ్యామా.‘‘ఏమయింది బాబా? డబ్బాలో నూనె లేదు!’’ ఆశ్చర్యపోయాడు శ్యామా.‘‘లేదు’’ నవ్వారు బాబా.‘‘మరి దీపాలు వెలిగించడం ఎలా?’’‘‘ఇలా’’ అన్నారు బాబా. మంచినీటి కుండ దగ్గరగా నడిచారు.వ్యాపారులంతా ఆసరికి మసీదుకి చేరుకున్నారు. చాటుగా దాగున్నారు. బాబా ఏం చేసేదీ చూడసాగారు.మంచినీటి కుండ మీది చెంబును అందుకున్నారు బాబా. ఆ చెంబుతో కుండలోని నీటిని తీసుకున్నారు. కడుపు నిండుగా ఆ నీరు తాగారు. కాస్సేపు ధ్యానంలో కూర్చున్నారు. తర్వాత లేచి, కడుపులోని నీటిని చెంబులోకి వమనం చేశారు.
ఆశ్చర్యపోయాడు శ్యామా. చాటుగా ఉన్న వ్యాపారులు కూడా బాబా చర్యకి విస్తుపోయారు.వమనం చేసిన నీటితో ప్రమిదలు దగ్గరికి నడిచారు బాబా. వొత్తులు వేశారందులో. నూనెగా చెంబులోని నీటిని పోశారు. దీపాన్ని వెలిగించ జూశారు.‘‘నీటితో దీపాలు ఏం వెలుగుతాయి?’’ అనుకున్నారు వ్యాపారులు. శ్యామాకి కూడా అదే అనుమానం.గాలికి దీపం ఆరిపోకూడదని, ఓ చేతిని అడ్డుపెట్టి, మరో చేత్తో దీపాన్ని వెలిగించారు బాబా. నీటి దీపం నూనె దీపం కంటే దేదీప్యమానంగా వెలగసాగింది. దీపాలు ఒకొక్కటీ వెలిగిస్తూ వచ్చారు బాబా. దీపావళి రూపుదిద్దుకుంది.శ్యామా ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. వ్యాపారులకు కూడా ఇది కలా? నిజమా? అనిపించింది. భయంతో లెంపలు వేసుకున్నారు. చాటు నుంచి తప్పుకుని, భక్తిగా బాబా ముందుకు వచ్చి నిల్చున్నారు.‘‘సాయిబాబాకీ జై! సాయిబాబాకీ జై’’ అంటూ జేజేలు పలికారు. అంతా క్షమించమన్నట్టుగా బాబా కాళ్ళ మీద పడ్డారు.‘‘నూనె ఇవ్వడం, ఇవ్వకపోవడం మీ ఇష్టం. కాని ఉండి కూడా నూనె లేదని అబద్ధం ఆడడం తప్పు, పాపం కూడా! దీపం దైవంతో సమానం. రోజూ మీ నూనెతో దైవం ప్రకాశించేవాడు. మీ పాపాలన్నీ పోగొట్టేవాడు. ఇవాళ తనని తానే వెలిగించుకున్నాడు. చూడండి, ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నాడో! ఒకరి కారణంగా ఒకరు గొప్పవారు కాలేరు. ఎవరికి వారే గొప్పవారు. గొప్పతనం పెంచితే పెరిగేది కాదు, తుంచితే తరిగేది కాదు. అర్థం చేసుకోండి.’’ అన్నారు బాబా.‘‘అర్థమయింది బాబా! అర్థమయింది.’’ అన్నారంతా. బాబాకి సాష్టాంగ ప్రణామాలు ఆచరించారు. వారిని దీవించాడు బాబా.‘‘అల్లా మాలిక్’’ అంటూ ఆకాశం కేసి చూశారు. ఆకాశంలో చంద్రుడూ, నక్షత్రాలూ బాబా పెట్టిన దీపాల ముందు వెలవెలబోతున్నట్టుగా కనిపించాయి.‘‘ఈ రోజు నుంచి ఈ పవిత్ర స్థలాన్ని ‘ద్వారకామాయి’ అని పిలుద్దాం.’’ అన్నారు బాబా.‘‘అలాగే బాబా’’ అన్నారంతా.‘‘ధర్మార్థ కామ మోక్షాల్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం ఈ స్థలం.’’ అన్నారు బాబా.వెలుగులతో నిండిన ద్వారకామాయిని పరవశించిపోతూ చూశారంతా.
⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
🔯ॐ ఓం గురుభ్యోనమః ॐ 🌻
🔯॥卐॥ ఓం శ్రీ సాయి రాం ॥卐॥🔯
🔯☪✝🔯
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About