బాధకు మూలం తెలుసుకో!

బాధకు మూలం తెలుసుకో!
👳👳👳👳👳👳👳👳👳👳👳👳👳
ఒకానొక గ్రామంలో ఒక పురోహితుడు ఉండేవాడు. పూర్వీకుల ఇంట్లో జీవనం సాగించేవాడు. కొంతకాలానికి పురోహితుడు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పాత ఇంటి నుంచి అన్ని వస్తువులనూ కొత్త ఇంటికి తరలించసాగాడు. వారింట్లో ఒక పాత అద్దం ఉండేది. చాలా పెద్దది. దానిని బయటకు తేవడానికి వీలుపడలేదు. ద్వారం చిన్నదిగా ఉండటం, అద్దం పెద్దగా ఉండటంతో ఏం చేయాలో పురోహితుడికి అర్థం కాలేదు. ఊళ్లో పెద్దలందరినీ పిలిచి సమావేశపరిచాడు. అద్దం బయటకు తెచ్చే మార్గం చెప్పమని కోరాడు. ఒక యువకుడు లేచి.. ‘ద్వారం తొలగించడమే మార్గం’ అని చెప్పాడు. ద్వారం తొలగించడం తనకు ఇష్టం లేదన్నాడు పురోహితుడు. మరో వ్యక్తి లేచి.. ‘అద్దాన్ని రెండుగా చేస్తే సరి’ అన్నాడు. అది కూడా ఒప్పుకోలేదు. ఇంతలో ఓ పెద్దమనిషి లేచి.. ‘‘నాయనా! అద్దాన్ని బయటకు తెచ్చే మార్గం గురించి ఆలోచిస్తున్నారు. బాగానే ఉంది. కానీ, ద్వారమా చిన్నది! అద్దమా పెద్దది! మరి ఆ అద్దం లోనికి ఎలా వెళ్లిందో ఆలోచిస్తే.. దానిని బయటకు తీసుకురావడమూ సులువే!’ అన్నాడు.

లోకంలో మనుషులు దుఃఖం ఎలా తొలుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ, ఆ దుఃఖం ఎలా కలిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. పూర్వం మహర్షులు అజ్ఞానం వల్ల దుఃఖం వచ్చిందని జ్ఞానాన్ని సముపార్జించేవాళ్లు. జ్ఞానం కలిగిన తర్వాత దుఃఖం దానంతట అదే తొలగిపోతుంది. అందుకే దుఃఖానికి మూలం తెలుసుకునే జ్ఞానం పొందాలి.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది