సంప్రదాయం వెనకదాగున్న సైన్స్ !!!
-------------------------------------------
🦋యోగి వెనన్న🦋
ఆడవారు గాజులు ధరించడం వెనుక:-
1⃣.పురాతన కాలంలో కేవలం మగవారే బయటికి వెళ్లి శారీరక శ్రమ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మహిళలు ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండి తక్కువగా శ్రమిస్తారు కాబట్టి వారికి గాజులను ధరింపజేసే వారు. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడాకంట్రోల్లో ఉంటుందట. అంతే కాకుండా ఆడ వారి శరీరం నుంచి విడుదలయ్యే నెగెటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపజేసే వారట.
2⃣.కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం:-
3⃣.హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. దీంతో వారి రుతు క్రమం సరిగ్గా ఉంటుందట. అయితే వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట.
4⃣.నుదుటన కుంకుమ బొట్టు ధరించడం:-
5⃣.నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట. లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందట
6⃣.ఎదుటి వారికి రెండు చేతులతో నమస్కరించడం:-
7⃣.ఎదురుగా ఉన్న వారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామట. ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపకశక్తిని పెంచుతాయట. దీంతోపాటు మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుందట
మీ...
మేలుకోరే