''ఏమండీ... ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?" అంది భార్య భర్తతో
"ఏం.. ఆరు ముక్కలుగా కోయమంటావా?" ప్రశ్నించాడు భర్త
"వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి నాలుగు ముక్కలు కొయ్యండి చాలు..! అంది భార్య.
భార్య:
ఏవండీ, మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి రాక్షసి. పెళ్ళి ఆపండి
భర్త:
నేనెందుకు ఆపుతాను? వాడేమైనా నాపెళ్ళి ఆపేడా?
😜🤣😂😀😆😜
అమ్మ కు ఎంత గౌరవమిస్తున్నారో భార్యకు కూడా అంతే ఇవ్వండి.
ఎందుకంటే
*ఒకళ్ళు చందమామ చూపిస్తారు.*
*మరొకరు చుక్కలు చూపిస్తారు.😊*