లక్ష్మి నరసింహ పురాణం -3
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
2.కాలమానం
ఇలా జరిగిన సృష్టిలో ఆయుః పరిమాణము నూరేళ్లు. అ లెక్క చెప్తాను విను భరధ్వజా!
పద్దెనిమిది నిముషాలు ఒక కష్ట, ముప్పై కాష్టలు ఒక కళ , ముప్పై కళలు ఒక ముహూర్తం, ముప్పై ముహుర్తాలు ఒక అహోరాత్రం ( ఒక పగలు ఒక రాత్రి ఇది మనుష్య మాసం . అలాటి పదునైదు దినాలు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక నెల. ఆరు నెలలు ఒక అయనం. వాటికీ ఉత్తరాయణం, దక్షిణాయణం అని పేర్లు. ఆ రెండు అయనాలు కలసి ఒక సంవత్సరం.
దేవతలకు దక్షిణాయణం ఒక రాత్రి. ఉత్తరాయణం ఒక పగలు. మానవుల గణనలో ఒక మాసం పితృ దేవతలకు ఒక దినం. వసువులకు ఓక దినం - మానవులకు ఒక సంవత్సరం. దేవమాసంలో వెయ్యి సంవత్సరాలు ఒక యోగం. అవే త్రేతాదులు. అలాటి యుగాలు వెయ్యి బ్రహ్మకు ఒక దినం . బ్రహ్మకు ఒక దినమైన కాలములో పద్నాలుగు మనువులు ప్రవర్తిస్తారు. ఒక మన్వన్తరం ఇంద్రాదులకు దేవమానమ్ ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కాలం అవుతుంది.
విశ్వ సృష్టికి ముందు దేవతలను పితృ దేవతలను ఈ వరుసలో గంధర్వులను , రాక్షసులను , యక్షులను, పిశాచాలను , గుహ్యకులను , రుషలను , విద్యాధరులను , మనుషులను, పశువులను, పక్షులను, స్థావరములను, పిపీలికలును , పాములను సృష్టిస్తాడు.
ఆ తర్వాత గుణకర్మ విభాగాలతో నాలుగువర్ణాలను ఏర్పరుస్తాడు . సృష్టిని ఇలా పగలు నడిపి రాత్రి కాగానే ముల్లోకాలను ఉపసంహరించి ఆ ప్రభువు ఆ రాత్రి శేషసాయియై యోగ నిద్రలో ఉంటాడు. ఆ రాత్రి నే కల్పాంతం అంటారు. . దానికే బ్రహ్మ కల్పమని పేరు. ఆ సమయాంతమందే మత్యావతారం,సముద్రమధనం, అలాగే వరాహ కల్పం ; ఇందంతా సర్వేశ్వరుని సంకల్ప రూప సంపద.
సముద్రజలాలలో మునిగివున్న భూమిని ఉద్దరించడానికి స్వయంబుద్ధితో శ్రీహరి వరాహమూర్తి అవుతాడు. ఇలా సృష్టించి నైమిత్తికమనే ప్రళయంలో ఆ సృష్టిని సంహరించి ఆదిదేవుడైన శ్రీహరి యోగనిద్రా ముద్రితుడౌతాడు.
3.మనువు
అలాగే నిద్రలో ఉన్న దేవుని నాభియందు పద్మం ఒకటి పుడుతుంది. దానినుంచి వేదవేదాంగాలు క్షుణ్ణంగా తెలిసినవ్యక్తి ఉదయిస్తాడు. అతడే బ్రహ్మ. ఆ బ్రహ్మకు "ప్రజలను సృష్టించు" అనే మాట వినవస్తుంది. నిద్రలో ఉన్న దేవుడు అదృశ్యుడౌతాడు.సృష్టి ఎలా చెయ్యాలి?బ్రహ్మకేమి పాలుపోలేదు. రోషం వచ్చింది. ఆ రోషం మూలంగా ఒక శిశువు పుట్టి బ్రహ్మ తొడపై కూర్చొని ఎడవనారంభించాడు.బ్రహ్మ వానిని ఓదార్చాడు. ' నా పేరేమిటన్నాడా శిశువు? నీ పేరా 'రుద్రుడు' అన్నాడు బ్రహ్మ ఆ శిశువు అలా మెల్లగా లేచి నీళ్లలో మునిగిపోయాడు.తరువాత బ్రహ్మ ఆలోచించి కుడిచేతి బొటనవ్రేలి నుంచి ఒక మగశిశువును, ఎడమ బొటనవ్రేలినుంచి ఒక ఆడుబిడ్డను సృష్టించాడు. ఆ బిడ్డపెరు దక్షుడు. ఆ ఇద్దరినీ దంపతులను చేసి సృష్టి చేయవలసిందని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు మొదట కలిగినవాడే 'మనువు'. స్వయంభువమనువుఅన్నా అతడే. ఈ విదంగా సృష్టి జరిగింది.
4.కశ్యప సంతతి
ఇక నవబ్రహ్మలకథ వినండి. మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతసుడు, వశిష్ఠుడు, భృగువు అని నవబ్రహ్మలు. వీరు బ్రహ్మ సంకల్పంవల్ల మానసపుత్రులుగా ప్రసిద్ధులైనవారు.
మరీచిభార్య సంభూతి. వీరి కొడుకు కశ్యపుడు. ఇతనిభార్యలు పడిమువ్వురు. వీరు దక్షునికూతుళ్లు. పెద్దమె అదితి ఆ తపస్వినికి పన్నెండుగురు కొడుకులు శోభనమూర్తులు కలిగారు.
రెండవభార్య దితి. ఈమెకు మొదటపుట్టిన కొడుకులు ఇద్దరు. ఒకడు హిరణ్యాక్షుడు. శ్రీహరి వరాహావతారుడై ఆ దృష్టున్ని హతమార్చాడు.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸