‘సత్యమేవ జయతే’ అన్న సూక్తిని చాలా మంది వినే ఉంటారు కాని దాన్ని ఎక్కడి నుంచి గ్రహించారో చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సూక్తిని ముండకోపనిషత్తు నుంచి స్వీకరించారు
సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమంతి ఋషయో హి ఆప్తాకామా
యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్॥
‘సత్యం ఒక్కటే జయిస్తుంది. దైవాన్ని చేరుకునేందుకు ఆ సత్యంతోనే మార్గం ఏర్పడుతుంది. నిష్కామమైన రుషులంతా ఆ సత్య మార్గం ద్వారానే పరమాత్మను చేరుకుంటారు అన్నది ఆ శ్లోకం అర్థం.
ఇందులో మొదటి పాదాన్ని మదన్ మోహన్ మాలవ్యా గారు ప్రచారం లోకి తీసుకొచ్చారు..
స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీషర్లను ఎదిరించి ధైర్యంగా నిలిచేందుకు ఈ సూక్తి ఒక మంత్రం లా పనిచేసింది.