నా దేశం మారుతోంది

*✳"నా దేశం మారుతోంది"*

*👉నిన్న GST,*
*మొన్న డిమానిటైజేషన్,*
*అవలి మొన్న స్వచ్చ భారత్.....*

*👇👇అన్నీ చారిత్రక ఘట్టాలే....*
*ఎవరూ ఉహించని విప్లవాలే👇👇*

*✳ఇక్కడ అమ్మాయిలు మొబైల్లలో టైం తింటున్నారు....*
*అబ్బాయిలు ఎదురు దెబ్బలు తింటున్నారు....*
*పోలీసులు లంచం తింటున్నారు....*
*నేతలు గడ్డి తింటున్నారు..*
*కాని రైతులు విషం తింటున్నారు..*
*జవాన్లు తూటాలు తింటున్నారు....*
*నా దేశంలో ఇంకా ఆకలి ఉంది అని*
*ఎవరు అన్నారు.....*
*👉"నా దేశం మారుతోంది"*

*✳ఈడ చీపురు పట్టినోడు డిల్లీ సిఎం కాగలడు*
*టీ అమ్మినోడు పి.ఎం. కాగలడు....*
*డిగ్రీలు,డిప్లొమాలు చేసినోల్లంతా*
*పేస్ బుక్ వాట్స్ అప్ లో బిజీగా ఉంటరు....*
*ఇంకా నా దేశం లో నిరుద్యోగం ఎడుంది....?*
*👉"నా దేశం మారుతోంది"*

*✳జపాన్ వాళ్ళు 7జి ట్రైల్స్ వేస్తున్నారు..*
*మనోల్లంతా 11 గ్రూపుల్లోకి సాయిబాబా అని పంపి ఫ్రీ రీచార్జ్ కోసం ఎదురుచుస్తున్నారు....*
*👉"నా దేశం మారుతోంది"*

*✳మా దగ్గర అగరుబత్తులు రెండు రకాలు....*
*ఒకటి దేవుడి కోసం....*
*ఇంకోటి దోమల కోసం....*
*కాని వాటి వాసనకి దేవుడు రాడు,*
*వీటి వాసనకి దోమలు పోవు..*
*👉"నా దేశం మారుతోంది"*

*✳కడుపు మాడిపోతుంది అయిన యోగ చేయిస్తున్నారు....*
*జేబుల్లో చిల్లి గవ్వ లేదు అయిన బ్యాంకు లో ఖాతా తెరిపిస్తున్నారు....*
*తలదాచుకోవడానికి గూడు లేదు కాని లెట్రిన్ కట్టిస్తున్నారు....*
*ఊళ్ళల్లో కరెంటు లేదు కాని డిజిటల్ బాట పట్టిస్తున్నారు....*
*మనం కులం కంపులో దోర్లుతున్నాం....*
*రోడ్డు కంపుల్లో స్వచ్ భారత్ అంటున్నాం....*
*మన గోవులు హైవేల మీద చస్తున్నాయి,*
*మనోళ్ళు గోరక్షణ కోసం చంపుతున్నారు....*
*👉"నా దేశం మారుతోంది"*

*✳డేట ధర తగ్గుతుంది..*
*టమాట ధర పెరుగుతుంది*
*ఇప్పటికైనా అర్ధం అయ్యిందా....*
*👉"నా దేశం మారుతోంది"....*

*✳👆👆ఇది నేటి భారతావని..👆👆*

*✍మా యువ జర్నలిస్ట్ కలం నుండి జాలువారిన "అక్షర కావ్యం‌".....!*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది