ఆషాడ అమావాస్య

*ఆషాడ అమావాస్య*

*పుష్యమి నక్షత్రం ఆదివారం అమవాస్య రావడం ఎంతో విశేషం చాలా సంవత్సరాలకి ఒకసారి ఇలా వస్తుంది. ఈ అమావాస్య పుష్యర్క యోగం ఉండటం వలన మనం చేసేటువంటి పూజ జపం దానం కొన్ని కోట్ల రేట్ల ఫలితం ఇస్తుంది*

*సకలాబీష్ట ప్రదాత , ఆర్థజన రక్షకుడు అయిన నరసింహ స్వామి ని ఆదివారం అమావాస్య రోజు పూజించడం వలన సకల దోషాలు పరిహార మవుతాయి*

*ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం  చాలా విశేషం ఈ రోజున నరసింహ స్వామి సన్నిధిలో బియ్యం పిండి తో దీపం చేసి నేతి తో  దీపారాధన చేసి తీర్థ ప్రసాదం తీసుకుంటే చాలా మంచిది*

*ఆడి అమావాస్య రోజు తమిళనాడు లో అహోబిల మఠం అధిన క్షేత్రం అయిన తిరువల్లూర్ అనే క్షేత్రం లో వెలసిన వైద్య వీర రాఘవ స్వామి వారిని ఎంతో అద్భుతం గా పూజిస్తారు అలాంటి విధంగా మన అహోబిల మఠం భద్రాచలం లో అదే తరహా పద్దతి లో వైభవంగా ఆరాధన జరుగుతుంది.కావున నృసింహ స్వామి ని ఆదివారం అమావాస్య నాడు ఆరాధించడం వల్ల  అసంఖ్యాక మైన ఫలితం పొందుతము*

*ఈ విశ్వం మొత్తం సకల ప్రాణికోటి ముక్కోటి దేవతలు నవగ్రహాలు నక్షత్రలు అన్ని కూడా నృసింహ ఆజ్ఞ మేరకే నడుస్తారు అని పెద్దల మాట*

*భద్రాచలం శ్రీ అహోబిల మఠం లో ఆడి అమావాస్య పూజ కొరకు  విశేష ఏర్పాట్లు చేయడం అయినది*

*కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామి అనుగ్రహం పొందుదాం*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది