🔥*గురువు ఎవరు*🔥
*ఇప్పటికాలంలో ప్రతివాడూ గురువే అవుతున్నాడు. శిష్యులు తక్కువైపోతున్నారు. గురువులు జాస్తి అయిపోతున్నారు. వాస్తవంగా గురువు అని మనం ఎవరిని అనవచ్చు? అనే ప్రశ్నకు ఆదిశంకరభగవత్పాదులవారు సెలవిచ్చారు. “కో గురుః? అధిగత తత్త్వః శిష్య హితాయోగ్యతస్సతతం” – కోగురుః – గురువు ఎవరు అని ప్రశ్న వేసి దానికి ఆయన జవాబు చెప్పారు అధిగత తత్త్వః శిష్యహితాయోగ్యతస్సతతం – ఎవరైతే శాస్త్రోక్తమైనటువంటి తత్త్వాన్ని గ్రహించి ఉన్నారో, ఎవరైతే శిష్యుని యొక్క సంశయాలు తీర్చగలిగి ఉంటారో ఎవరైతే శిష్యులయొక్క హితమునే సదా కోరుతూ ఉంటారో ఆ వ్యక్తియే గురువు అనే పదానికి యోగ్యుడు అవుతాడు. కాబట్టి గురువుకి ముఖ్యంగా ఉండవలసిన యోగ్యతలు రెండు: ౧. శిష్యుని యొక్క సంశయములను తీర్చగలిగే శక్తి ఉండాలి.శిష్యుల యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారిని ఉన్నతి వైపు నడిపియగలగాలి ౨. శిష్యునియొక్క హితమునే సదా కోరేటటువంటి వాడై ఉండాలి.3 పరుషార్థములు నెరవేర్చి నాలుగవ పురుషార్థము వైపుకు నడిపియగలగాలి ౩*
*శిష్యులకు మంచి కలిగిస్తూ వారి నుండి ఏమి ఆశించకుండా పరమపదాసోపానము ఎక్కియగలగాలి .ఈ మూడు*
*లక్షణములున్నప్పుడే ఆ వ్యక్తి గురువు అవుతారు*