ఈ రెండూ కలిపితింటే త్వరగా బరువు తగ్గుతారు





స్వీట్ కార్న్ ఉడకబెట్టి ఈ రెండూ కలిపితింటే త్వరగా బరువు తగ్గుతారు
స్వీట్ కార్న్ ఉడికించి అందులో ఉప్పు, కారం, మసాలా చల్లితే ఎవరికి మాత్రం నోరు ఊరదు చెప్పండి.. స్వీట్ కార్న్ తింటే ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. ఇక స్వీట్ కార్న్ కారణంగా శరీరంలోకి షుగర్ చేరుతుందన్న అపోహ కూడా చాలా తప్పని పోషకాహార నిపుణులు ఇటీవలే స్పష్టంచేశారు. సహజ సిద్ధంగా తినే ఆహారాల ద్వారా శరీరానికి అందే తీపితో ఎటువంటి ప్రమాదం ఉండదని వెల్లడించారు. ఇంతకూ స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకులు తింటూ బరువు తగ్గిపోవడం ఎలాగో కింద తెలుసుకుందాం..

అధిక బరువులో కొద్ది మొత్తాన్ని ఇలా కూడా తగ్గించుకోవచ్చు:
మనం చిరుతిండ్లు తినే బదులు రోజూ సాయంత్రం పూట కొద్దిగా స్వీట్ కార్న్ ఉడకబెట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, మిరియాల పొడి చల్లుకుని తింటే చాలు త్వరగా బరువు తగ్గుతారు. ఎందుకంటే కార్న్ లోని పీచు పదార్థం జీర్ణం త్వరగా అయ్యేందుకు తోడ్పడుతుంది. తద్వారా వెంటనే శక్తిగా మారి శరీరానికి అందుతుంది. ఇక నిమ్మ, మిరియాల్లోని కొవ్వును కరిగించే తత్వం బాగా ఉంటుంది. తద్వారా శరీరానికి పోషకాలు అందడమే కాకుండా వేస్ట్ కొవ్వు కరిగిపోతుందన్నమాట. అంతేకాదు స్వీట్ కార్న్ లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరో ఉపయోగం ఏమిటంటే ఇందులోని ఫెరులిక్ ఆమ్లం వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా అడ్డుకుంటుంది.

మరిన్ని ఉపయోగాలు:

* ఇందులోని విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

* స్వీట్ కార్న్ లోని థయామిన్ మెదడు ఆరోగ్యానికి, ఫోలేట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

* స్వీట్ కార్న్ లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యల్ని సమర్థంగా ఎదుర్కొంటుంది.

* పీచు పదార్థం కారణంగా జీర్ణ క్రియలు వేగవంతం అవుతాయి.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది