🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌺గురుపౌర్ణమి విశిష్టత🌺
*గురువు*అనగా అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని అందరికీ తెలిసిన విషయమే కానీ గురుపౌర్ణమి అంటే ఏమిటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది దానికి విశిష్టత........
🌺ప్రపంచానికి నాలుగు వేదాలు అష్టాదశపురాణాలు,భాగవతం,భారతం ద్వారా సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే మొట్టమొదటి మహాపురుషుడు వేదవ్యాస భగవానుడు.ఆయన జన్మదినమైన వ్యాసపూర్ణిమ.గురుపూజ జరుపుకోవడం మన సంప్రదాయం.అయితే శ్రీమన్నారాయణుని తొలిగురువుగాను వారి అంశ అయిన వేదవ్యాసులవారిని పరమేశ్వరుని అంశ అయిన భగవత్ పాదుల వారిని మలి గురువులుగారిని ఆ తరువాత వచ్చే మన గురువులను వ్యాసస్వరూపులుగా భావించి,పూజించమని శాస్త్రకారులు నిర్ణయించిరి.అందుకనే
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం౹
అస్మదా,అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం౹౹
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
అనే శ్లోకాన్ని మహాత్ములు మనకు అందించారు.
🍁అయితే నిజానికి ఈ భూమిమీద అవతరించిన మొదటి గురుస్వరూపులు శ్రీ దత్తాత్రేయులవారు.వారు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులు కనుకనే గురువును పరబ్రహ్మగా భావించిన సంప్రదాయం మనకు లభించింది.
🍀సృష్టి లో ఉన్న ఏ మహాత్మునిలో ఏ జ్ఞానం ప్రకటమైనా ఏ శక్తి ప్రకటమైనా అది శ్రీ దత్తప్రసాదమేనని పెద్దలు చెప్తారు.ఆ దత్తులవారి పరిపూర్ణ అవతారమే శ్రీసాయినాథులవారు.కనుకనే నేడు *గురుపౌర్ణిమ*అంటే ప్రధానంగా శ్రీ సాయినాథులవారి ఆరాధనే మనకు కనిపిస్తుంది.
🌺ఆకాశంలాంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో నక్షత్రాలు వంటి గురువులు ఎందరున్నా వారిలో మన *శ్రీసాయినాథులవారు*పూర్ణచంద్రుని వంటివారు.కారణం ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు.ఒక సం౹౹లో ఎన్ని పండుగలు వున్నా గురుబంధువులకు *గురుపౌర్ణమికి* మించిన పండుగ మరొకటి ఉండదు.
🍁ఈ గురుపౌర్ణమినాడు శ్రీసాయిసచ్ఛరిత్ర పారాయణం,శ్రీసాయినామ సంకీర్తన,సత్సంగం,శ్రీసాయిపదధ్యానం చేసి మన గురుదేవులైన షిరిడీ సాయినాథులవారి సంపూర్ణ అనుగ్రహం పొందెదముగాక.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏