మానవజాతికి మహోపకారం చేసిన మహనీయురాలు 'మేరీ క్యూరీ' వర్దంతి మ:జూలై 4, 1934





🌐👩🏻‍🔬👏🏻➖➖➖➖➖➖➖
*మానవజాతికి మహోపకారం చేసిన మహనీయురాలు 'మేరీ క్యూరీ' వర్దంతి మ:జూలై 4, 1934
➖➖➖➖➖➖➖🌸🌸🍃
★ ప్రపంచ చరిత్రలోనే మేరీ క్యూరీ లాంటి వ్యక్తులు చాలా అరుదు. తన అనన్య సామాన్య శాస్త్రీయ పరిశోధన ద్వారా రేడియం కనుగొన్న వనిత మేరీ క్యూరీ, 19వ శతాబ్దంలో స్త్రీలకు సైన్సులో చాలా యూనివర్శిటీలలో ప్రవేశం లేదు. అలాంటి పరిస్థితులలో తన నిరంతర పరిశ్రమ, పట్టుదల, మొక్కవోని ధైర్యంతో కృషిసల్పి మొట్ట మొదటిసారిగా నోబెల్‌ బహుమతి పొందిన స్త్రీ ఆమె.

*🔸అంతేకాదు1903 లోనూ,1911 లోనూ రెండు సార్లు నోబెల్‌ బహుమతి పొంది చరిత్ర సృష్టిం చింది. ఫిజిక్స్‌లోను, కెమిస్ట్రీలోనూ ఆ అత్యున్నత గౌరవం పొందింది.*

🔸1867 నవంబరు 7న పోలెండులో ఒక సామాన్య కుటుంబంలో జన్మిం చింది. అత్యంత ప్రతిభావంతమైన హైస్కూలు విద్యార్థి అయినా, ఆ పేద విద్యార్థికి కాలేజీ విద్య ఎండమావి అయింది.ధనికుల ఇళ్ళల్లో 15 సంవత్స రాలు పనిచేసి, 24 సంవత్సరాల వయస్సులో విజ్ఞానతృష్ణ గల ఆమె ఆస్ట్రియా లో  క్రకో యూనివర్శిటీలో చదువుదామ నుకొంటే, స్త్రీలకు సైన్సులో ప్రవేశం లేదన్నారు. ఒక్కపారిస్‌ యూని వర్శిటీలో స్త్రీలకు ప్రవేశం ఉండటంతో, పారిస్‌ వెళ్ళి సైన్సు అధ్యయనా నికి పూనుకొంది. పోలెండు నుండి పారిస్‌కు రైలులో 4వ తరగతిలో అంటే, గూడ్సు బండిలాంటి రైలు పెట్టెలో తన కుర్చీ తాను తెచ్చుకొని ప్రయాణం చేసింది.

*🔸తనకు వున్న అతి తక్కువ డబ్బుతో, చిన్న గదిలో, అర్థాకలితో ఎముకలు కొరికే చలిలో, గది హీటింగుకు డబ్బులు లేక, చేతులు కొంకర్లు పోతున్నా, దీక్షతో చదివి అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా విజయం సాధించింది.26 సంవత్స రాలు వచ్చినా పెళ్ళిధ్యాస లేకుండా చదువులో నిమగ్నమైంది.*

🔸తన పరిశోధనలో వున్న ఆమెకు మరో ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు పీరీక్యూరీ పరిచయంతో భార్యా భర్తలై తమ సైన్సు పరిశోధన సమిష్టిగా కొనసాగించారు. భార్యాభర్తలు ఉభయులూ ఫ్రీథింకర్స్‌. మతకర్మకాండ లేకుండా నిరాడం బరంగా పెళ్ళి చేసుకొని, తమకు ఉన్న ఆస్తి అయిన రెండు సైకిళ్ళపై, ఫ్రాన్సులో హనీమూన్‌'కి వెళ్ళారు. వచ్చి మరల ఎవరి పరిశోధనలో వారు మునిగి పోయారు.

🔹అదేకాలంలో రోంట్‌జెన్‌ ఎక్సరే కనుగొన్నారు. అలాగే హెన్రీ బెకెరెలా ''బెకెరెల్‌ రేస్‌'' కనుగొన్నారు.





*🔸ఆ స్ఫూర్తితో మేరీ రేడియో యాక్టి విటీ మీద పరిశోధన ప్రారంభిం చింది. ''-రేడియో యాక్టివిటీ'' అని ఆమే నామకరణం చేసింది. కేన్సరు చికిత్సకు రేడియంను మేరీ-పీరీ క్యూరీలు సంయుక్తంగా కనుగొన్నారు.*

*🔸1898లో వారు "పొలోని యం'' కను గొన్నారు.*

*🔸మరికొద్ది నెలల్లో వారిద్దరూ 'రేడియం'' కనుగొన్నామని ప్రకటించారు. అది సైన్సు రంగంలో తుఫాను సృష్టించింది. ఇతర సైంటిస్టులు రేడియం యొక్క ''యాటమిక్‌ వెయిట్‌'' చెప్పే వరకూ క్రొత్త పదార్థం ''రేడియం'' వుందని నమ్మం అన్నారు.*

🔸యురేనియం కంటే రేడియం 20 లక్షల రెట్లు శక్తివంత మైనది. లెడ్‌ తప్ప అన్నింటిలో నుండీ రేడియం కాంతిరేఖలు ప్రసరిస్తాయని క్యూరీ దంపతులు కనుగొన్నారు.

*🔸నాలుగు సంవత్సరాలు అహోరాత్రాలు కృషి చేసి రేడియం, రేడియం యాట మిక్‌ వెయిట్‌ తీసి చూపించారు. 8 టన్నుల ఫిచ్‌బ్లెండ్‌ శుద్ధిచేసి, చివరకు ఒక చిన్న బటానీ గింజ అంత ఒక్క గ్రాం రేడియం తీయగలిగారు. దాని ఆటమిక్‌ వెయిట్‌ 225 అని వారు ప్రకటించారు.*

*🔸రేడియం కనుగొన గానే వైద్యశాస్త్రంలో చికిత్సకై వాడటం ప్రారంభమైంది. తమకు పేటెంట్‌ అక్కరలేదని, మానవ కళ్యాణానికి, సైన్సు పరిశోధనకూ రేడియంని అర్పించిన మానవతా మూర్తులు వారు.*

*🔸మేరీక్యూరీ నోబెల్‌బహుమతి పొందినా ఆమె స్త్రీ కనుక యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా నియమించలేక పోయారు. రేడియం కనుగొనే వరకూ ఆమెకు ఏ రకమైన జీతం కూడా యివ్వలేదు! పీరీని మాత్రం ప్రొఫెసర్‌ చేశారు. కాని 1906లో రోడ్డు ప్రమాదంలో పీరీ హఠాత్తుగా మరణించాడు. అప్పటికి ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు, ఫ్రెంచి ప్రభుత్వం రాచమర్యాదలతో అంత్యక్రియలు చేస్తానంటే, నిరాకరించి, ఆమే స్వయంగా భర్తను ఏ కర్మకాండా లేకుండా నిరాడం బరంగా ఖననం చేసింది.*





🔸పీరీ మరణానంతరం, మేరీని సాక్‌బోర్న్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌ చేసి చరిత్ర సృష్టించారు.1909లో మేరీ రేడియోయాక్టివిటీ  మీద ప్రపంచంలో మొట్టమొదటి కోర్సు నిర్వ హించి చరిత్ర సృష్టించింది. మరోప్రక్క కేన్సరు నివారణ పరిశోధనలో ఆమె మునిగి పోయింది.

*🔸1914లో మొదటి ప్రపంచయుద్ధం లో ఆమె రేడియం థెరఫీ ప్రారంభించింది. మొబైల్‌ ఎక్సరే యూనిట్లు ప్రారంభించింది. క్షతగాత్ర సైనికు లకు ధనుర్వాతం రాకుండా ఆమె రక్షించింది. సైనికులకు ఆమె ఎనలేని సేవ చేసింది. రేడియం ద్వారా ఆమె చేసిన మహో పకారాన్ని గుర్తించి ఫ్రెంచి అకాడమీ ఆఫ్‌ మెడి సిన్‌ ఆమెను సభ్యురాలిగా ఎన్నుకొని చరిత్ర సృష్టించింది. ఒక స్త్రీ ఆ అకాడమీ సభ్యురాలు కావడం ప్రప్రథమం, తన స్వదేశమైన పోలెండు లో కూడా రేడియం ఇన్‌స్టిట్యూట్‌ ఆమె ప్రారంభించింది.*

🔸రేడియం కనుగొన్న రజతోత్సవాలలో 1923లో ఫ్రెంచి అధ్యక్షుడు స్వయంగా పాల్గొని ఆమెకు సాలుకు 40 వేల పౌండుల పెన్షన్‌ ప్రకటించాడు.

*🔸ఎన్ని గౌరవాలు వచ్చినా, తన పరిశోధనా రంగాన్ని వీడలేదు. విద్యార్థులతో కలిసి ఫ్రాన్సు గ్రామాలలో నడుస్తూ, సైన్సు చర్చలలో పాల్గొనేది. అప్పుడే యువకుడైన ఐన్‌స్టయిన్‌ మేరీతో రేడియో యాక్టివిటీపైన చర్చలు జరిపాడు.  ఆమె కుమార్తెలు ఇరీన్‌, ఇనా యిద్దరూ సైంటిస్టులు అయ్యారు. ఇరీన్‌కు ఆమె భర్తకూ కెమిస్ట్రీలో నోబెల్‌ బహుమతి లభించింది.*

*🔸రేడియం, ఎక్స్‌రేలపై నిరంతర పరి శోధనలో రేడియం ధార్మిక ప్రభావంతో మేరీక్యూరీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింది. చివరిక్షణం వరకూ తన పుస్తకం వందలాది పేజీలు ప్రూఫులు దిద్దుతూనే వుంది. ఆమెది విరామమెరుగని శాస్త్రీయ పురోగమన జీవితం. 1934 జూలై4న మేరీ క్యూరీ మరణించింది. ఏ రేడియం కనుగొనడం వలన మానవజాతికి మహోపకారం చేసిందో, అవే రేడియం కిరణాలు ఆమెను అధికంగా సోకడం వలన ఆమె మరణించింది.*

🔸1934 జూలై 6న పీరీ క్యూరీ సమాధి ప్రక్కనే మేరీ క్యూరీని కూడా నిరాడంబరంగా, మత కర్మకాండ లేకుండా ఆమె కోరికకు అనుగుణంగా ఖననం చేశారు. రాజ లాంఛనా లు తిరస్కరించింది. గుప్పెడు పోలెండు మట్టిని ఆమె సమాధిపౖౖె చల్లారు.

*🔸విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టయిన్‌ ఆమె మరణానికి సంతాపం తెలుపుతూ తన రెండు దశాబ్దాల స్నేహాన్ని పేర్కొంటూ, ''మేరీ క్యూరీలాగా పట్టుదల, దీక్ష, స్వచ్ఛత, నిరాడం బరత, నిష్పక్షపాత బుద్ధి, సునిశిత పరిశోధన, మానవత్వ దృష్టి-యిన్ని గుణాల సమ్మేళనం అయిన వ్యక్తులు చాలా అరుదు'' అని ఐన్‌స్టయిన్‌ అన్న మాటలు ఆమె విశిష్ట వ్యక్తిత్వానికి, కర్తవ్యదీక్షకు ప్రతీక.*

★ ఆమె మానవజాతికి మహోపకారం చేసిన మహనీయురాలు. స్త్రీల అనన్య సామాన్య శక్తి సామర్థ్యాలకు ఆమె జాజ్వల్య మానమైన ప్రతీక. అతి సామాన్య జీవితం నుండి పట్టుదల, దీక్ష. మొక్కవోని ధైర్యంతో మేరీ క్యూరీ ముందడుగు వేసి స్త్రీ పురుష సమానత్వానికి ప్రతీకగా, మహోన్నత ఆదర్శంగా నిలిచింది.

(జ:నవంబర్ 7,1867–మ:జూలై 4, 1934) 





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది