విశ్వమానవ విశ్వాసాలను జయించిన.. 'వివేకానందుని వర్దంతి మ:జూలై 4, 1902





🇮🇳🌐✊🏻➖➖➖➖➖➖➖
*విశ్వమానవ విశ్వాసాలను జయించిన.. 'వివేకానందుని వర్దంతి మ:జూలై 4, 1902)
➖➖➖➖➖➖➖🌸🌸🍃
*_"బలమే జీవనం... బలహీనతయే మరణం"_*

*_"లేండి..!, మేల్కొనండి...!! మీ గమ్యం చేరేదాక విశ్రమించవద్దు"_*

*_"మానవసేవాయే మాధవసేవ"_*

....ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవిత సత్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహామనిషి స్వామీ వివేకానంద. 

*★ భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ధీరోదాత్తుడు స్వామివివేకా నందుడు. మన దేశ సంస్కృతీ సాంప్రదాయా లను వెలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి. చిన్న వయసులోనే మహా గ్రంధాలను చదివి, అమ్మ చెప్పిన మాటలోనే, అదే బాటలోనే ఒకరికి అపకారం తలపెట్టకుండా ఉపకారిగా వ్యవహరించిన ఆదర్శవంతుడు. వివేకానందుడు బోధనలు నాటికి, నేటికీ, రేపటికీ ఎప్పటికీ మనం గుర్తుకోవలసిన ఆచరించినవలసిన సూక్తులు.*

■ ఆయన 1863 జనవరి 12న జన్మించారు. మహా గురువు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన వివేకానందుని పూర్వ నామం నరేంద్ర నాధుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసంగాలు చేసి వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములను సమాజానికి అందించారు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే చిరకాలంగా నిలిచిపోయే మహోన్నత ఆధ్యాత్మిక నాయకుడు. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.తన భావాలను సమాజానికి పంచి మేల్కొలిపిన మహానుభావుడు.

*■ తన ప్రసంగాలతో భారతదేశాన్ని జాగృతము చేశారు. అంతేకాదు విదేశాలలో సైతం తన ఉపన్యాసములతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.తన గురువు రామకృష్ణుడు నేర్పిన 'జీవుడే దేవుడు' అనేది వివేకానందుని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' ఆ భగవంతునికి చేసే సేవతో సమానమన్నారు. విశ్వమంతా బ్రహ్మం నిండి ఉందనీ, హెచ్చు తగ్గులు లేవనీ చాటారు. అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వాన్ని చాటిచెప్పారు.ఇలా హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపచేసిన వివేకానందుడు... విదేశాలలో పర్యటనలు ముగించుకుని మన దేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ 39 ఏళ్ళ వయసులోనే పరమపదించారు.*

*■ ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.*

*🍥నరేంద్రుని జీవితంలోని కొన్ని సంఘటనలు..*

*■ ఒకరోజు ధ్యానములో మునిగివుండగా, పెద్ద నాగుపాము అతని ముందు ప్రాకసాగింది. అక్కడే వున్న తోటి బాలురు దానిని చూచి భయపడి నరేంద్రుని అక్కడ్నించి లెమ్మని కేకలు వేశారు. కాని అతనికి ఆకేకలు వినబడలేదు. తన ధ్యానంలో తను నిమగ్నమయి వున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఆ పాము అక్కడ్నించి వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి నరేంద్రుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. పాము వచ్చినా పారిపోలేదు ఏమిటని అతని తల్లిదండ్రులు ప్రశ్నించగా, తనకా సంగతే తెలియదనీ, ధ్యానంలో హాయిగా వున్నదని నరేంద్రుడు జవాబిచ్చాడు.*

*🎯తల్లి పెట్టిన పరీక్ష..📝*

■ వివేకానందుడు ప్రపంచమత మహా సమావేశాలకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, ఇక కొన్ని రోజులలో అతను బయలుదేరుడానికి సమయం ఆసన్నమైన సమయంలో వివేకానందుడు తల్లి, తన కొడుకు తలపెట్టబోతున్న కార్యక్రమం గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష పెట్టింది. అంతకంటే ముందుగా రాత్రి భోజనానికి రావాలని తన తనయుడుని పిలిచింది. తల్లి చేతి వంట తిని అటుగా కూర్చున్న వివేకానందుడుకి, ఒక గిన్నెలో కొన్ని పళ్ళు, ఒక కత్తి ఇచ్చి తినమని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత నాయనా ఒకసారి నాకు ఆ కత్తి ఇవ్వగా ఈ పండు కోయడానికి అని వివేకానందుడిని కత్తి ఇవ్వమని కోరింది ఆ తల్లి. వివేకానందుడు తన తల్లి అడిగినట్లుగానే కత్తి ఇచ్చాడు. వెంటనే ఆ తల్లి నేను పెట్టిన ఈ పరీక్షలో నువ్వు గెలిచావు. ఇక నిశ్చింతగా నువ్వు విదేశాలకు వెళ్ళవచ్చు అని చెప్పింది. వివేకానందుడికి ఏం జరిగిందో తెలియక, అమ్మా నువ్వు నాకు పరీక్ష పెట్టావా? ఏమిటా పరీక్ష? నాకు ఏమి అర్థం కాలేదు అని అడిగాడు. “నేను నిన్ను కత్తి ఇవ్వమన్నప్పుడు ఎదురుగా ఉన్న నాకు.. అలానే ఇవ్వకుండా పదునుగా ఉన్న వైపుని మూసివేసి, ఆ పదును ఉన్న వైపును నువ్వు పట్టుకున్నావ్, అలాగే చెక్కతో ఉన్న ముందు భాగాన్ని నాకు పట్టుకోవడానికి ఇచ్చావు” అని చెప్పింది. అక్కడ ప్రసగించే సభలలోనూ నువ్వు చెప్పే మాటలు హానికరంగా, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండవని, ఎదుటివారి రక్షణ తర్వాతే నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావని వివేకానందుడి తల్లి బదులిచ్చింది. ఇలా తల్లి పెట్టిన ఈ పరీక్షలో వివేకానందుడు ఆలోచనలు, ఆయన గొప్ప మనసు తెలిసింది.

*■ ఒకసారి స్వామివివేకానందుడు అమెరికాలోని చికాగోలో జరుగుతు న్న ప్రపంచ మత సమావేశంలో మన దేశం గొప్పదనాన్ని, హిందూ ధర్మాన్ని,తన గురించి ఎంతో గొప్పగా ఆ సభలలో తెలిపాడు. అయితే *సన్యాసిగా ఉన్న వివేకా నందుడిని, ఆయన వేషధారణ ను చూసిన ఓ అమెరికన్ మహిళ ఎంతో కుతూహలంగా “మీరెందుకు పెద్ద మనిషిలా ఉన్నతమైన వ్యక్తిలా కనిపించ డానికి మంచి బట్టలు ధరించరు” అని అడిగింది.*

*★ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానంగా “మీ సంస్కృతి ప్రకారం మీరు  ఉన్నతంగా కనిపించడానికి మీ టైలర్ ను నమ్ముతారు, కానీ మా వ్యక్తిత్వం బట్టే మేము ఉన్నతమైన వ్యక్తులమా? పెద్ద మనుషులమా”అనేది తెలుస్తుందని వివేకానందుడు బదులిచ్చాడు.*

*🍥జ్ఞాపక శక్తి సామర్థ్యం...😇*

*■ చికాగోలో ఉన్నప్పుడు వివేకానందుడు ప్రతి రోజూ ఒక లైబ్రరీకి వెళ్లి, అక్కడి నుండి కొన్ని పుస్తకాలు ఇంటికి తెచ్చుకునేవాడు. ఇదంతా గమనిస్తున్న లైబ్రేరియన్ ఒకరోజు వివేకానం దుడుని… “ఎందుకని మీరు ఇక్కడ కూర్చొని ఆ పుస్తకాలు చదువుకోకుండా ప్రతిరోజూ ఇంటికి తీసుకువెళతారు అని అడిగారు. నేను ప్రతి పుస్తకంలోని ప్రతి పేజీని, ప్రతి లైన్ ను చదువుతానని వివేకానందుడు సమాధానం ఇచ్చాడు. ఎందుకో లైబ్రేరియన్ కు ఆయన మాటలు నమ్మబుద్ధి కాక, సరే మీకో పరీక్ష పెడతానని అన్నారు.  మీ ఇష్టం అని వివేకానందుడు చెప్పాడు. ఒక పుస్తకంలోని ఏదో పేజీలో ఒక పేరాగ్రాఫ్ ఒక పదం గురించి చెప్పి ఆ తర్వాత ఏం రాసి ఉంది అని, ఇలా కొన్ని పుస్తకాల నుండి ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ టకాటకా ఎక్కడ పొల్లులోకుండా వివేకానందుడు సమాధానం ఇచ్చాడు. వివేకానందుడు చెప్పిన సమాధానాలకు అతడు విస్తుపోయారు. వివేకానందుడు ఏ పని చేసినా, ఏ పుస్తకాన్ని చదివినా సరే ఎప్పుడూ తన కళ్ళను, మనసును, మెదడును ఆ పనిపై కేంద్రీకరించి చేసేవాడు. అలా ఎప్పుడు ఎక్కడ అలాంటి ప్రశ్నలు అడిగినా తన బ్రెయిన్ లో అలా స్టోర్ ఉండేది. ఇది ఆయన జ్ఞాపకశక్తికి నిదర్శనం.*

*■ అమెరికాలోని చికాతో నగరంలో 1893 సెప్టెంబరు 11వ తేదీన సర్వమత సభలో స్వామి వివేకానంద ‘‘అమెరికాదేశపు సోదర సోదరీమణులారా’’ అంటూ ప్రారంభించి తన చారిత్రాత్మక ప్రసంగం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. భారతదేశ చరిత్రలో ఇది అపురూపమైన ఘట్టం. ఆ తర్వాత ప్రపంచం మొత్తం పర్యటించారు. యువతకు స్ఫూర్తిగా నిలిచే ఎన్నో ప్రసంగాలు చేశారు.*

*■ యువత నిర్జీవంగా వుంటే ఆ దేశ ప్రగతి కుంటుపడుతుందని చెప్పారు. శక్తివంతమైన యువతతోనే దేశాభివృద్ధి వుంటుందని నిరూపించారు.*





*🎯ముఖ్య  సూత్రములు..తత్త్వములు..*
*■ వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికం గా,రాజకీయంగా కూడా ఉపయోగపడుతుం ది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవతో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటా ము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసు కున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహమును కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు" అనే నినాదము మీద స్థాపించాడు. సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటి ని గురించి ఆలోచించకు. మనిషి హృదయం లో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జిం చండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని* *సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదనిగ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. అవి ఇక్కడ వివరించబడ్డాయి.గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగ్రుతులు కండి.దీర్ఘ (?)అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాలయి. సాహసాన్ని ప్రదర్శించండి.మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.*

■ తన ఉపన్యాసాల ద్వారా భారతదేశాన్ని జాగృతము చేయటమే కాకుండా, పాశ్చాత్య దేశాలలో కూడా హిందూ మత గొప్పతనాన్ని గురించి ఉపన్యాసాలు చేసారు. "హిందూత్వం అంటే మతం కాదని అది జీవన విధానం అని చెప్పిన జ్ఞాని శ్రీ వివేకానంద.

*■ దేవుడి గురించి ఆయన జరిపిన అన్వేషణలో భాగంగా, శ్రీ రామకృష్ణుల వారిని కలిసిన తర్వాత నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడుగా మారారు.*

*■ భారతదేశం ఇల్లు అయితే, ప్రజలు ఆయనకు సోదర, సోదరీమణులు అయ్యారు. "ఆకలితో వున్న వారికి మతం గురించి చెప్పొద్దు. అన్నం పెట్టండి" అనేవారు. పేదవాడిని సేవిస్తే భగవంతుని సేవించినట్లే అని చెప్పేవారు. ఇతర మతాలను, ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోనూ, సిద్ధాంతంలోనూ ఎంతో కొంత మంచి వుంటుందని భోదించారు.*

■ ఆయన దేశమంతా పర్యటించారు. కమండలము, కాషాయము ఆయన ఆస్తి. కఠిన బ్రహ్మచర్య దీక్షలను పాటించేవారు. కటిక నేలపై పడుకునేవారు.

*■ నేటి యువతకు స్ఫూర్తి, చైతన్య దీప్తి, స్వామి వివేకానంద.39 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఆయన పది జన్మలకు సరిపడా కృషి చేశారు. ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయిన స్ఫూర్తిని నింపారు.*

(జ:జనవరి 12, 1863 - మ:జూలై 4, 1902)
                 🍃🌸🤗🌸🍃





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది