బాలింతలు తీసుకొనవలసిన , తీసుకొకూడని ఆహారపదార్ధాలు

బాలింతలు తీసుకొనవలసిన , తీసుకొకూడని ఆహారపదార్ధాలు  -

   చాలామంది స్త్రీలు ప్రసవించిన తరువాత తీసుకొనే ఆహారం విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రసవించిన స్త్రీ తీసుకునే ఆహారం పైనే శిశువు యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

బాలింత తీసుకోవలసిన ఆహారపదార్థాలు -


* పాతబియ్యం

* ధనియాలపొడి .

* శొంఠిపొడి .

* కందికట్టు .

* చేదు పదార్థాలు .

* ఎండు చేపలు .

* కాల్చిన మాంసం .

* నేతిలో వేయించిన మాంసం .

* ఎండబెట్టిన మేకమాంసం .

* ఎండబెట్టిన అడివిజంతువుల మాంసం .

* మాంసం కి అల్లం, ఉప్పు , కొద్దిగా కారం ,గరంమసాలా రాసి ఎండించి కావలసిన ముక్కలను పలచగా కొట్టి నేతిలో గాని , నూనెలో గాని వేయించి తినాలి.

* నూనె .

* తెలగపిండి.

* సోరకాయ .

* మునగాకు కూర .

* వెల్లుల్లిపాయలు .

* ఇంగువ.

* పాతబెల్లం.

* ఇనుపమేకు కాల్చి ముంచిన వేడినీళ్లు .

* 15 లేక 21 దినముల వరకు వంటిపూట అన్నం భుజించవలెను .

* కాయలు తినడం .

* రొట్టె , కాఫీ పుచ్చుకొనవచ్చు.

  తినకూడని ఆహారపదార్థాలు  -

* కొత్తబియ్యపు అన్నం .

* చద్ది అన్నం .

* పచ్చిచేపలు .

* పులుసు పదార్థాలు .

* మజ్జిగ .

* పెరుగు .

* శీతల పదార్థాలు .

* చల్లటిగాలిలో ఉండటం.

* తడిప్రదేశంలో ఉండటం.

* చన్నీళ్ళ స్నానం .

* చల్లటి పదార్థాలు తీసుకోవడం .

 
     పైన చెప్పిన విధంగా ఆహారనియమాలు పాటిస్తూ మీ ఆరోగ్యం , మీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు .
   🙏జై గోమాత🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది