దేశవాళి ఆవు నెయ్యి గురించి

జై గోమాత ...... జైజై విశ్వమాత

దేశవాళి ఆవు నెయ్యి గురించి .....

      ఆవు నెయ్యి అంటే పూర్తిగా పసుపు పచ్చగా ఉంటుంది అనుకొంటూ వుంటారు కొందరు. కాని వాస్తవంగా ఆవు నెయ్యి యొక్క రంగు ఒక్కో రుతువులో ఒక్కోరకంగా ఉంటుంది. ఆవు ఆకు పచ్చని మేతను ఎక్కువగా తిన్నప్పుడు అది ఇచ్చిన పాలను తీసిన నెయ్యి ఎక్కువ పసుపు పచ్చిగా ఉంటుంది. వేసవిలో ఆవు ఎక్కువగా ఎండిన మేతను తినడం వలన అది ఇచ్చే పాలనుండి తీయబడిన నెయ్యి అంత పసుపు పచ్చగా ఉండదు. మరొక విషయం ఆవు నెయ్యిలో రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగం ఎండాకాలంలో కూడా ఘన పదార్ధంలా గట్టిగానే ఉంటుంది. ఇక తక్కిన భాగం పలుచగా , ద్రవంలాగా ఉంటుంది.

      ఒకే చోట నిలబడి ఉంటే ఆవు ఇచ్చే పాలలో పోషక విలువలు అంత ఎక్కువగా ఉండవు. ఆవు స్వేచ్ఛగా సంచరిస్తూ మేత మేస్తూంటే ఆరోగ్యంగా ఉంటుంది. కనుక తిరుగుతూ మేతమేసే ఆవుల పాలు , నెయ్యి ఎంతో నాణ్యమైనవి.

      శుద్ధమైన ఆవు నెయ్యి మాత్రమే శరీరం యొక్క బరువును సమతూకంలో ఉంచుతుంది. అంటే ఎవరైన తక్కువ బరువు కలిగి ఉంటే వారి బరువు పెరుగుతుంది. అలాగే అధిక బరువు వారికి బరువు తగ్గుతుంది. ఆవు నెయ్యి తో శరీరంలోని కొలెస్ట్రాల్ పూర్తి సాధారణ స్ధాయికి చేరుతుంది.

      " నెయ్యి ఎప్పుడూ అరిగిస్తుంది. " . అజీర్తి రోగమున్నవారు , జీర్ణ శక్తి తక్కువగా ఉన్నవారు తప్పకుండా ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఆవు నెయ్యి మనకు అద్భుతమైన ప్రాణ శక్తిని ఇస్తుంది. ఆవు నెయ్యి అరగటం అనేది అసలు సమస్సనే కాదు. అద్భుతమైన , ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు ఉన్నది. ఆవు నెయ్యి లోనే  ఉన్నాయి. ఆవు నెయ్యి జీర్ణ శక్తికి ఎంతో మంచిది. ఆవు నెయ్యి   తేలికగా జీర్ణమవుతుంది.

      శుద్ధమైన దేశవాళి ఆవు నెయ్యి ని స్వీకరించి , సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

             " హరే కృష్ణ "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది