బిక్షా పాత్ర !

🐳బిక్షా పాత్ర !🐳
.
ఏదైనా ఒక కోరిక కలిగితే అది తీరే వరకూ మనసు మనసులో ఉండదు . అది నీనుండి దూరం అయితే నీకు నిరాశ ! అది దగ్గరయితే సంతోషం ! ఈ ఆనందం ఎంత సేపు ? తాత్కాలికమే !!
.

కోరిక తీరగానే కలిగే ఆనందం క్షణికమే ! మళ్ళీ వేరే కోరిక ! ఒక కోరిక తీర గానె ఇంకోటి అంతు లేని నిరాశలూ , అంతం లేని ఆనందాలూ .....
.
.
కోరికలలో మనసు దాగి ఉంది .
కోరికలు లేని స్థితి అంటే మనసు లేని స్థితి .
అంటే భావాతీత స్థితి . అదే నిశ్చల స్థితి .. అదే ధ్యాన సంసిద్ధతా స్థితి .
.
.
ఒక బిక్షకుడు రాజు గారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు ఉదయాన్నే !
.

ఆ సమయం లో రాజుగారు ఉదయమే తోటలో విహారానికి వెళతారనీ ఎక్కువ మంది కూడా ఉండక పోవడం వలన తనకు దర్శనం కలుగుతుందనీ అతడి ఆశ . రాజు గారికి ఎదురుపడి నమస్కరించాడు .
.
" ఏమి కావాలి ? " అని అడిగాడు రాజు
.
నమస్కారం రాజా ! మీరు ఏది అడిగినా ఇచ్చేస్తారా ? ఇంకొక్క సారి ఆలోచించుకోండి మహారాజా ! అన్నాడు బిక్షుకుడు .
.
రాజుకు ఆశ్చర్యం కలిగింది . ఎన్నెన్నో యుద్ధాలు చేసి ఎన్నెన్నో విజయాలు పొంది , ఎంతో కీర్తి గడించిన తను ఒక బిచ్చగాడి కోరికను తీర్చడానికి పునరాలోచిన్చుకోవడమా ?
.
అది ఒక అవమానం గా భావించాడు రాజు
.
రాజులో అహం తన్నుకు వచ్చింది .
.
.
" నువ్వు ఏమి అడిగినా పరవాలేదు . నేను ఇచ్చి తీరుతాను . ఇది నా హామీ ! " అంటూ బిచ్చగాడిని తన కోరిక చెప్పమన్నాడు .
.

.
బిచ్చగాడు " అయ్యా ! ఇది నా బిక్షా పాత్ర . దీనిని మీరు నింపండి . మీరు దేనిని దేనితో నింపినా పరవాలేదు . ఇది పూర్తిగా నింపండి చాలు . రాజా ! మీరు కావాలంటే ఇంకోసారి మళ్ళీ ఆలోచించుకోండి . ఇప్పటికైనా మీరు తప్పుకోవచ్చు " అన్నాడు
.
అతడి బిక్షాపాత్రను చూశాడు రాజు . నవ్వు వచ్చింది రాజుకి . ఒక చిన్న బిక్షా పాత్ర . మంత్రికి కబురు పెట్టాడు .
.
" ఆ పాత్ర నిండా వజ్రాలను నింపి ఇతడిని పంపండి " అని ఆజ్ఞాపించాడు .
.
.
చిత్రం అందులో వేసిన వజ్రాలు వేసిన వెంటనే మాయమయిపోయాయి .
.
రాజుకు ఆశ్చర్యం వేసింది . తన కోశాగారం లో ఉన్న బంగారం , వెండి , వరహాలూ అన్నీ వెయ్యమన్నాడు . ఎన్ని వేసినా అన్నీ మాయమయి పోతున్నాయి . పాత్ర మాత్రం నిండటం లేదు .
.
బిచ్చగాడిని సమీపించాడు రాజు
.
మహానుభావా ! ఇదేమిటి ? నీవు ముందుగానే హెచ్చరించావు . అయినా నేను వినలేదు . ఎందుకిలా జరుగుతోంది . ఎంత సంపద అందులో వేసినా ఎందుకు అది నిండటం లేదు ? ఇలా ఎందుకు జరుగుతోంది ?
.
.
" ఓ రాజా ! ఇది మానవ కంకాళం ! . . ఇందులో ఏది వేసినా అంతా మాయం అవుతూనే ఉంటుంది ..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఈ కధలో నుండి మనం ఏమి గ్రహిద్దాం ?
.
.
మనకు ఎంత కీర్తి , పదవి , దానం , పేరు , ప్రతిష్ట , ..... లభించినా అన్నీ మాయమయిపోతూనే ఉంటాయి . మనకు తృప్తి ఉండదు . ఇంకా కావాలి అని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటాము . ఏదో కావాలి అనే ఎదురు చూపు మనలను ఈక్షణం ప్రశాంతంగా ఉండనివ్వదు
.
.
ఈ ప్రపంచం లో రెండు రకాల మనుషులు ఉంటారు
.
పూర్తిగా ఎప్పటికీ నిండని బిక్షా పాత్రతో శ్మశాన వాటిక వరకూ నడిచేవారు
.

కోటికొక్కరు చొప్పున బిక్షా పాత్రను వదిలిపెట్టిన వారు . వీరు కోరికలు లేని స్థితిలో ఉండడం వలన వారిలోనే అంతా చూడగలరు .
.
కొద్ది సేపు కళ్ళు మూసుకుని మన జీవితాలను మనం సమీక్షించుకోవడానికి ఈ కధ ఉపయోగ పడితే నేను ధన్యునిఅయినట్టు.
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది