రాత్రి నా భార్యను కొట్టినట్లు కలొచ్చింది..!" గాబరాగా చెప్పాడు రామయ్య
"మరేం చేసావేమిటి?" అడిగాడు సోమయ్య
"పొద్దున్నే లేచి మా ఆవిడను క్షమాపణ అడిగాను" చెప్పాడు రామయ్య
##########################
మీరు ఈ మధ్య మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.. ఎందుకని?" అడిగింది సుందరి
"ఆ మధ్య నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ రక్తమేగా ఎక్కించింది..!" అన్నాడు సుందర్.
#########################
ఏమిటి నర్స్..? రేపు ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ తిరిగి చూడకుండా పారిపోతున్నాడు..?" అడిగాడు డాక్టర్
"ఆపరేషన్ అయ్యాక ఏం చేస్తారు అని అడిగాడు.. మీ బంధువులకు అప్పగిస్తామని పొరపాటున అనేశాను..!" చెప్పింది నర్స్.
########################
అవునొదినా.. ఆ.. సుమతి వాళ్ళింట్లో ఏ పనిమనిషి పట్టుమని రెండురోజులు పని చేయకుండా మానేస్తేందెందుకు?"అడిగింది సుజాత
"ఆ.. వాళ్ళాయన అస్సలు చనువే తీసుకోడట..!" చెప్పింది లక్ష్మీ
#######################
ఆపరేషన్ చేసాక వేసిన కుట్లుమీద పువ్వులు కనబడుతున్నాయేమిటి?" అడిగాడు గాబరాగా వినయ్
"మా లేడీ డాక్టర్‌గారికి ఎంబ్రాయిడరీ తెలుసట అందుకని..!" నచ్చ జెప్పింది నర్సు.