ఈ-మెయిల్ సత్తా

ఒక వ్యక్తి కొత్తగా హోటల్లోకి దిగాడు
రూమ్లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది
భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు
కానీ తొందర్లో చూసుకోకుండా
తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు
సీన్ కట్ చేస్తే..
ఎక్కడో మరో చోట
భర్త కోల్పోయిన ఒక స్త్రీ
స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది
కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత
తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని
ఈ-మెయిల్ ఖాతా తెరిచింది.
వాటిలో ఒక మెయిల్ చూడగానే
కళ్ళు గిర్రున తిరిగి పడిపోయింది
ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు
కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు
ఆ ఈ-మెయిల్ సారాంశం.
ప్రియమైన భార్యామణీ!
విషయం: నేను చేరుకున్నాను.
నేను ఇంత తొందరగా
మెయిల్ చేస్తున్నందుకు
నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు
మన ప్రియమైన వాళ్ళకు
ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా
ఇప్పుడిక్కడ కంప్యూటర్లు కూడా పెట్టారోయ్!
ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను
రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు
అన్ని ఏర్పాట్లూ చేస్తాను
నీ కోసం కళ్ళు కాయలు
కాచేలా ఎదురు చూస్తుంటాను
నీ ప్రయాణం కూడా నా ప్రయాణంలానే
సుఖంగా జరగాలని ఆ దేవుడిని
ప్రార్థిస్తూ.. నీ ముద్దుల భర్త..!
😘 😘
😂 😂 😂
😆 😜 😆 😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది