నమ్మకం

👉ఒక వ్యక్తి తన జుట్టు సమంగా కత్తిరించుకోవడానికి క్షవరసాలకి వెళ్లాడు.

👉 అక్కడ మంగలి, పని మొదలుపెట్టగానే ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు.

👉 భగవంతుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టేసరికి, మంగలి”నాకు భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం లేదు” అన్నాడు.

👉  “ఎందుకు అలా అంటున్నావు”అని ఆ వ్యక్తి ఆడిగాడు.

👉 మంగలి ఇచ్చిన సమాధానం.” బైటకి వెళ్ళి చూస్తే, భగవంతుడు ఉన్నాడు అని నమ్మకం కలగదు.

👉 నిజంగానే భగవంతుడు ఉంటే, ఎందుకు మనుషులు సుస్తీతో బాధ పడుతున్నారు?

👉 ఇంతమంది అనాధపిల్లలు ఉంటారా?

👉 ఎవరయినా బాధ పడతారా?

👉 నిజంగా భగవంతుడికి ప్రేమ ఉంటే ఇవన్నీ చుస్తూ ఊరుకుంటాడా?

👉 ఆ వ్యక్తి కాసేపు ఆలోచించి, ఏమీ సమాధానం చెప్పలేదు.

👉  అనవసరంగా వాదన చేయడం ఇష్టం లేక.

👉 మంగలి పని ముగించగానే, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు.

👉 రోడ్డు మీదఒక మనిషిని చూసాడు. పొడుగు జుట్టుతో సమంగా కత్తిరిచుకోకుండా, చూడడానికి అసహ్యంగా ఉన్నాడు.

👉  అప్పుడు, ఆ వెంటనే, మంగలి కొట్టుకి వెళ్ళి ఇలా అన్నాడు. “నీకు తెలుసా, మంగలి ఉన్నాడు అని నాకు నమ్మకం లేదు”

👉 అప్పుడు, మంగలి, “అలా ఎలా అనగలువు, నేను ఇప్పుడే నీకు క్షవరం పని చేశాను కదా”

👉 అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, “నిజంగానే మంగలి ఉంటే, బయట ఆ మనిషి అలా, అంత జుట్టుతో అసహ్యంగా ఉండడు.”

👉 అప్పుడు మంగలి “నా దగ్గరికి రాకపోతే నేను ఏమి చేయ గలను” అని అన్నాడు.

👉 దానికి ఆ వ్యక్తి, “మనుషులు భగవంతుడి సహాయం కోసం, సాధనతో ఆయన దగ్గరికి వెళ్ళాలి.

👉 ఎప్పుడు అయితే భగవంతుడికి దగ్గర అవుతామో ,అప్పుడు సంతోషంగా ఆనందం గా ఉంటాము. భగవంతుడు నీలోను నాలోను అన్ని జీవరాసుల లో భగవంతుడు ఉన్నాడు.”

           *నీతి*

👉 భగవంతుడు కావాలి అని అనుకునే వాడికి, భగవంతుడు తప్పకుండా ఉంటాడు.

👉 భగవంతుని దర్శించాలనే వారు మంగలి పెరిగిన జుత్తును కటింగ్ చేసిన విధంగా మనం మనలోపల పెరిగిన కామ క్రోధ లోభ మధమాత్సర్యాలను ధ్యానం చేత కత్తిరించాలి.

👉 మంగలికి కత్తెర ఏలా అతనికి ఆయుధమెా అలా భగవంతుని దర్శించాలనే వారికి ధ్యానం ఏకైక ఆయుధం.

👉 భగవంతుడు కావాలని కునేవారు నమ్మకంతో సాధన చేత  ఆయనకు చేరువకావాలి.

👉  భగవంతుడు ఎక్కడో లేడు?  నీ మొహంలో చిరునవ్వు, ఎదుటి వాడు బాధ పడుతుంటే జాలి చూపించటం, అహింస; కరుణ ; ప్రేమ; అన్ని జంతువుల పట్ల దయ చూపించడం. మన దగ్గర వాళ్ళతో  ప్రేమగా ఉండడం,అన్ని కూడా, భగవంతుడు మనలో ఉండి చేయిస్తున్నాడు.

👉 భగవంతుడి కోసం మన హృదయంలో  నమ్మకంతో సాధన(ధ్యానం) తో మనం దృష్టి పెడితే నవ్వుతూ కనిపిస్తాడు.
🙏🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది