ఒక సి. ఐ. డి ఆఫీసర్ ఒక ఫోన్ నెంబరును రహస్యంగా తన పై అధికారికి చెప్పవలసి ఉంది. అందువలన ఒక కథ రాసి పంపించాడు. ఆ కథలో ఫోన్ నెంబర్ ఉందని చెప్పాడు.
కథ -
మా ఊరిలో శ్రీరామ నవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పెద్దలు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటే పిల్లలు మరోపక్క అష్టాచెమ్మా ఆడుకుంటూ ప్రసాదాలు ఎప్పుడిస్తారోనని చూస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడంటే చాలా భక్తి . ఉత్సవాలకు ప్రతీ సంవత్సరం పదివేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఉద్యగం చేస్తుండడం వల్ల తరచుగా రావడానికి అవ్వదు. ఈసారి వారం రోజులు ఉంటానని వచ్చాడు. కానీ ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో రెండురోజులకే వెళ్ళిపోయాడు. అతడు ఉండి ఉంటే లలిత కళల గురించి షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకున్నాం..ఏం చేస్తాం. కుదరలేదు.
పైన రాసిన దాంట్లో దాగి ఉన్న ఫోన్ నెంబర్ కనిపెట్టండి చూద్దాం..