ఆదిపర్వము – 18
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
దుష్యంతుడి తిరస్కారం
శకుంతల తన కుమారునితో, శిష్యులతో దుష్యంతుని వద్దకు వెళ్లింది. కాని దుష్యంతుడు ఆమెను గుర్తించలేదు. ఆశ్రమంలో తన పట్ల చూపిన వలపు, ఆదరణ, ఆసక్తి అతనిలో కనిపించలేదు. శకుంతలకు అనుమానం కలిగింది.
"దుష్యంతుడు నిజంగా తనను గుర్తించలేదా, లేక తెలిసిన తెలియనట్టు ఉన్నాడా. లేదా రాజ్య కార్యాలలో పడి తనను మర్చిపోయాడా, లేక తనను పెండ్లి చేసుకున్న నాటి మాటలు మరచి తనను వదిలి వేసాడా. ఎవరన్నా దేనినన్నా మరిచిపోతె తిరిగి జ్ఞాపకం చెయ్యవచ్చు, కాని ఇలాగా తెలిసి కూడా తెలియనట్టు నటించే వారికి చెప్పడం బ్రహ్మ తరం కాదు. అయినా ఇంత దూరం వచ్చి, తిరిగి ఆశ్రమానికి తిరిగి వెళ్లి పోవడం మంచిది కాదు. ఆరోజు జరిగింది అంతా చెప్పి, ఈ కుమారుని చూపిస్తాను" అని మనసులో నిశ్చయించుకుంది శకుంతల.
"ఓ రాజా, ఆరోజు నువ్వు వేటకు అడవికి వచ్చావు. నా తండ్రి కణ్వ మహామునిని దర్శించుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చావు. నన్ను చూసావు. మోహించి, నన్ను గాంధర్వ విధిని వివాహమాడావు. నాకు పుట్టబోయె కుమారుని రాజును చేస్తాను అన్నావు. ఇడుగో నీ కుమారుడు" అని తన కుమారుడు భరతుని చూపించింది.
ఇది అంతా చూసాడు దుష్యంతుడు, అతనికి అంతా తెలుసు కాని ఏమీ తెలియని వాని వలె "నీవు ఎవరివో నాకు తెలియదు, నేను నిన్ని ఎప్పుడూ చూడలేదు. నీవు ఎక్కడ నుండి వచ్చావో అక్కాడకు పో" అని అన్నాడు.
శకుంతలకు దుఃఖం పొర్లుకు వచ్చింది. "మహారాజా, అన్నీ తెలిసీ ఏమీ తెలియని వానివలే ఎందుకు మాట్లాడతావు. ఆరోజుజరిగిన మన వివాహానికి సాక్షులు ఎవ్వరూ లేరని, ఇలా అబద్ధాలు ఆడవచ్చునా! ఇది మీకు తగునా! కాని మనలను, సూర్య చంద్రులు, పంచభూతాలు, మన హృదయం, యముడు, రాత్రి పగలు ఎప్పుడూ గమనిస్తూనె ఉంటాయి. కట్టుకున్న భార్యను తిరస్కరించే వాడికి ఇహలోక సుఖం గాని, పరలోక సుఖం గాని దక్కవు. పుత్ర సంతానాన్ని పొందాలంటే భార్య కావాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలను సాధించాడానికి, వంశాన్ని నిలపడానికీ, ఉత్తమగతులు పొందడానికి, హృదయానికి ఆనందం కలిగించడానికి భర్తకు భార్య అవసరం. భార్యా బిడ్డలను ఆదరంతో చూసేవాడికి ఎలాంటి కష్టాలు రావు.
అదియును కాక భార్య భర్తలో అర్థ భాగము. అనుకని భర్తకంటె ముందు భార్య చనిపోయిన, స్వర్గంలో భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాని భర్త ముందు చనిపోతె, భార్య కూడా అతనితో సహగమనం చేస్తుంది. అలాంటీ భార్యను అవమనిచడం ధర్మం కాదు.
పురుషుడు తన భార్య శరీరంలో ప్రవేశించి, తిరిగి ఆమేకు పుత్రుడుగా జన్మిస్తాడు. కాబట్టి కొడుకులో భర్తను చూసుకుంటుంది స్త్రీ. తండ్రి కూడా, తన రూపానికి ప్రతి రూపమైన కొడుకును చూసి ఆనందిస్తాడు. పైగా పున్నామ నరకం నుండి ఉద్ధరించే వాడు పుత్రుడు. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగినట్టు, నీ శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టాడు. కాబట్టి నీ పుత్రుని కౌగిలించుకొని, ఆనందించు. నీ కొడుకు నీ వంశకర్త అవుతాడని సరస్వతి చెప్పింది. మన వివాహం జరిగిన రోజు తమరు నాకు ఇచ్చిన మాటను మరవడం తగునా, మనకు పుట్టిన ఈ కుమారుని నిరాకరించడం తగునా.
ఈ లోకంలో సత్యం పలకడంకన్నా మంచి పని మరొకటిలేదు. వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలం, ఒక సత్య వాక్యంతో సమానము. ఎన్ని తీర్థాలు సేవించినా, వేదాలు అన్ని చదివినా, అవి సత్యం చెప్పడంతో సాటిరావు. నేను అప్సరస అయిన మేనకకు, రాజర్షి అయిన విశ్వామిత్రునికి పుట్టిన దానను, ధర్మం తప్పి నేను అసత్యం పలుకను. కాబట్టి, తమరు నాకు కణ్వాశ్రమములో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని, నన్ను, మన కుమారునికి స్వీకరింపుడు" అని పలికింది శకుంతల.
కాని దుష్యంతుడు అంగీకరింపలేదు. "నేను మహారాజును, నువ్వు సామాన్య ఋషి కన్యవు. నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు, ఆడవారు అబద్ధాలు అడుదురు అనే మాట సార్థకం చేస్తున్నావు. ఎత్తుగా, బలంగా కనపడుతున్న ఇతడిని నా కొడుకు అని చెపుతున్నావా. ఇలాంటి అబద్ధాలను నేను అంగీకరించను. నీవు నీ ఆశ్రమానికి తిరిగి పొమ్ము" అని తిరస్కరించాడు దుష్యంతుడు.
"మహారాజా, నాకు తిరస్కారాలు కొత్త కాదు. పుట్టిన నాడే తల్లి తండ్రులచేత విడువబడ్డాను. నేను నోచిన నోములు అంతే అని సరిపెట్టుకుంటాను. ఇంతకన్నా ఏమీ కాదు కదా. ఇంక నాకు ఆ భగవంతుడే దిక్కు" అంటూ కొడుకును తీసుకొని వెనక్కు తిరిగి వెళ్లబోయింది.
అప్పుడు ఆకాశం నుండి ఒక వాక్కు వినిపించింది.
"ఓ దుష్యంత మహారాజా! శకుంతల నిజమే చెప్పింది. ఈ శకుంతల నీ భార్య, ఈ భరతుడు నీకు, శకుంతలకు పుట్టినవాడు. వీరిని స్వీకరించుము"
ఇది విని దుష్యంతుడు లేచి సభలో ఉన్న వారితో ఇలా అన్నాడు.
"సభా సదులారా, ఆరోజు నేను శకుంతలను గాంధర్వ విధిని వివాహమాడినాను, నాకు ఈమెకు తప్ప వేరే ఎవరికి తెలియదు. లోక నిందకు వరిచి ఇప్పటిదాకా ఈమె నాకు తెలియదు అన్నాను. కాని ఇప్పుడు ఆకాశవాణి అందరకూ నిజం తెలియచేసింది. నేను నా బార్యా పుత్రులను స్వీకరిస్తున్నాను" అని పలికి, శకుంతలను,భరతుని సాదరంగా స్వీకరించాడు. భరతుని యువరాజుగా చేసాడు. కొంతకాలం రాజ్య సుఖాలు అనుభవించి, కుమారుడైన భరతునికి రాజ్యం అప్పగించి, భార్యతో తపోవనానికి వెళ్లాడు.
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About