భారతీయ తత్వశాస్త్రం.

‌           *భారతీయ తత్వశాస్త్రం.*    *12*
          (Indian Philosophy)
    *(భారతీయ వైదిక దర్శనాలు)*
           ‌‌‌      *ప్రస్థాన త్రయం*
      ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు,                   
                 *శ్రీమద్భగవద్గీత.*                                               
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
                   *ఆరవ అధ్యాయం*
               *ఆత్మ సంయమ యోగం.*
                      (ధ్యానయోగము)
...‌......‌........................................................
       *శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పెను:-*
      కర్మఫలంపైన ఆధారపడకుండా, చేయవలసిన కర్మని ఎవరు చేస్తారోఅతడే కర్మ సన్యాసీ, కర్మ యోగీ. అగ్ని కార్యాన్నీ, కర్మనీ వదిలేసినవాడు కాదు.
      అర్జునా దేనిని సన్యాసమని అంటారో అదేయోగమని తెలుసుకో. సంకల్పాలను సన్యసించనివాడు ఎవడూ యోగికాలేడు.
      యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతూంది. యోగాన్ని అధిరోహించిన వానికి శాంతమే సాధనమని చెప్పబడుతుంది.
      ఎప్పుడైతే విషయ వస్తువులలోను, కర్మలలోనూ తగుల్కోకుండా సర్వ సంకల్పాలను వదిలి వేస్తాడో అప్పుడు యోగరూఢుడని పిలవబడతాడు.
................................................................
*ప్రతివ్యక్తి తననుతావే ఉద్ధరించుకోవాలి*
..............................................................
      తన్ను తానే ఉద్ధరించుకోవాలి. అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు. తనకు తానే శతృవు.
      స్వాధీనమైన మనస్సు అతని బంధువు. స్వాధీనంలో లేని మనస్సు అతనికి శతృవై శతృత్వంతో వర్తిస్తుంది.
      మనస్సుని జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలలో, సుఖదుఃఖాలలో మానావమానాలలో పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు.
      జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందిన వాడు, పరమాత్మలో నిలిచినవాడు, ఇంద్రియాలను జయించిన వాడు, మట్టి, రాయి, బంగారాలని సమంగా చూసేవాడు ఐన యోగి *'యుక్తుడని (యోగాగ్రేసరుడు)'* అని పిలవబడతాడు.
...............................................................
     *అందరితోనూ సమభావంతోను,*
     *ఆత్మదృష్టి ఉన్నవాడు విశిష్ఠుడు.*
...............................................................
      మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్తులు, మధ్యవర్తులు, ద్వేషించదగిన వారు, బంధువులు, సజ్జనులు పాపులు అందరి పట్ల సమభావంతో ఉన్నవాడు *'విశిష్టుడు'* అని చెప్పబడతాడు.
...............................................................
*ధ్యానంతో ఆత్మసంధానం మొనర్చు యోగి*
    *నిర్వాణపదం (మోక్షం) పొందుతాడు.*
...............................................................
      ఏకాంతంలో ఉండి చిత్త ఇంద్రియాలను నిగ్రహించి, ఆశాపరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సుని ఆత్మలో లయం చేయాలి.
      శుచియైన ప్రదేశాంలో అట్టే ఎత్తుగానూకాక, మరీ కిందగానుకాక, దర్బాసనం మీద లేడి చర్మం, దానిమీద వస్త్రాన్ని పరచి స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకొని, ఆ ఆసనంపైన కూర్చుని మనస్సుని ఏకాగ్రం చేసి చిత్తేంద్రియ వ్యాపారాలను నిగ్రహించి, ఆత్మ శుద్ధికోసం యోగాన్ని అభ్యసించాలి.
      శరీరాన్ని, మెడని, తలనీ నిటారుగా కదలకుండా నిటారుగా ఉంచి, దిక్కులు చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ, ప్రశంతమైన మస్సుతో భయాన్ని విడిచి, బ్రహ్మచర్య వ్రతంలో నిలిచి, మస్సుని బాగా నిరోధించి, నాలో చిత్తాన్ని నిలిపి, నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యాన యుక్తుడై ఉండాలి.
      మనస్సును నిగ్రహించిన యోగి ఇలా ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో ఉండి 'నాలో ఉన్నదీ, *'నిర్వాణపదము'* అయిన శాంతిని పొందుతాడు'.
...............................................................
        *ఆహారవిహారాలను అదుపులో ఉంచుకున్న వాడికే యోగం సిద్దించును.*
.............................................................
      అర్జునా! ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్ర పోయేవాడికి, అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు. ఎల్లప్పుడు సాత్వికాహరమునె భుజించాలి
      ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వానికీ, కర్మలో తగు మాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ తగుమాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ సమంగా పాటించే వానికీ యోగం (జన మరణ) దుఃఖాన్ని హరిస్తుంది.
      ఏ కామ్య వస్తువు పైనా కోరిక లేక, నిగ్రహింపబడిన మనస్సు ఆత్మలోనే ఉన్నప్పుడు అతడిని *'యోగ సిద్ధుడు'* అని అంటారు.
      ఆత్మ సమ్యమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సునుని, గాలి లేని చోట ఉంచిన దీపం స్థిరంగా ఉండే స్థితితో పోల్చుతారు.
...........................................................
*సుఖదుఃఖాలకు అతీతమైనది యోగం.*
............................................................
      యోగాభ్యాసం ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ (యోగి) ఆనందిస్తాడో...
      ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోతగినదో, ఇంద్రియాలకు అతీతమో, అంతంలేనిదో, ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ, ఆ అనుభవాన్నుంచి చలించకుండా ఉంటాడో...
      దేనిని పొందిన తరవాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖంచేత కూడా చలించడో, అతడె నిజమైన యోగి.
      దుఃఖంతో సంబంధం లేని స్థితిని యోగం అని తెలుసుకోవాలి, ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో, పట్టుదలగా సాధించాలి.
      సంకల్పవల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచి పెట్టలి. మనస్సు ద్వారానే ఇంద్రియాలన్ని అన్ని వైపులనుండి నిగ్రహించాలి.
      ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సుని (బాహ్య ప్రపంచమ్నుండి మళ్ళించి) శాంతింప చేయాలి. మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకోకూడదు.
      నిలకడ లేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, అక్కడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.
      ఈ విధంగా రజోగుణం శమించి, దోషరహితమైన, ప్రశాంతమైన మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైఅన ఉత్తమ సుఖం లభిస్తుంది.
      ఇలా నిరంతరం ఆత్మాభాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా నశిస్తాయి. బ్రహ్మ స్పర్శ ఉన్న అత్యంత సుఖా న్ని తేలికగా పొందుతాడు.
...............................................................
    *యోగి అన్ని ప్రాణులలోను తనను,*
   *తనలో అన్ని ప్రాణులను దర్శిస్తాడు.*
................................................................
      యోగంతో కూడిన సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని ప్రాణులలో తననీ, తనలో అన్ని ప్రాణులనూ చూస్తాడు.
      నన్ను అన్నిటిలోనూ అన్నిటిలో, నాలో అన్నిటినీ ఎవరు చూస్తారో అలాంటి వారికి నేను మరుగు కాను. అతడు నాకూ మరుగు కాడు.
      అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నింటా పరమాత్మ ఒక్కడే అన్న భావం పొంది సేవిస్తారో, ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు.
      అర్జునా దుఃఖంగానీ, సుఖంగానీ తనతో పోల్చుకుని తనతో సమానంగా అందరిలోనూ చూస్తాడో, ఆ యోగి శ్రేష్టుడని నా అభిప్రాయము.
      *అర్జునుడు ఇలా అడిగాడు; -*
       కృష్ణా నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగం మనస్సు యొక్క చంచల స్వభావం వలన నిలుస్తుందని నాకు అనిపించడం లేదు.
      కృష్ణా మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ గాలిని అణచడంలాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని నేను భావిస్తాను.
      *శ్రీ కృష్ణా భగవానుడు ఇలా అన్నాడు: -*
      సందేహం లేదు. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. అది చలిస్తుంది. అయితే కుంతీ కుమారా! అభ్యాసం చేతా వైరాగ్యం ద్వారానూ మనోనిగ్రహం సాధ్యం ఔతుంది.
      మనస్సు స్వాధీనంలో లేని వాడికి యోగం పొందడం కష్టమని నా అభిప్రాయం. చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో సాధించ వచ్చును.
      *అర్జునుడన్నాడు: -*
      శ్రద్ధ ఉన్నా మనస్సుని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేక పోయేవాడు, యోగం నుండి మనస్సు జారిపోయి యోగసిద్ధిని పొందనపుడు ఏమౌతాడు.
      ఓ మహానుభావా! బ్రహ్మ పధంలో నిలవలేని మంద బుద్ధి ఇహపరాలు రెంటికీ భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించి పోడా?
      కృష్ణా! నా ఈ సందేహాన్ని సమూలంగా చేదించ తగిన వాడివి నీవే. నా అనుమానాన్ని తీర్చగలిగిన వాళ్ళు లోకంలో నీకంటే ఏవరూ లేరు.
      *శ్రీ కృష్ణుడు ఇలా పలికాడు:-*
      అర్జునా యోగబ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం లేదు. నాయనా! మంచి పని చేసేవాడెవరూ దుర్గతిని పొందడు కదా.
      యోగబ్రష్టుడు పుణ్యలోకాలని పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి. తరవాత శుచివంతులు, శ్రీమంతులు ఐన వారి ఇంట్లో జన్మిస్తాడు. లేదా యోగ బ్రష్టుడు జ్ఞానులైన ఇండ్లలో పుడతాడు. లోకంలో ఇలాటి జన్మ చాలా అరుదైనది.
      కురునందనా! అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని పొంది, ఆస్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు.
      పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వలన యోగ భ్రష్టుడు వివశుడై యోగం వైపు లాగబడతాడు. యోగాన్ని గురించి కేవలం కుతూహలం చూపినా, ఓంకారాన్ని జపించడం వలన లభించే వైదిక కర్మ ఫలాన్ని దాటి పోతాడు.
      యోగి దీక్షతో చేసే ప్రయత్నం వలన పాపాలనింటి నుండి విడివడి శుద్ధుడై, అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమగతిని (మోక్షం) చేరుకుంటాడు.
      అర్జనా! తపస్సు చేసేవారికంటే, జ్ఞానులకంటే, జ్ఞానులకంటే, కర్మచేసే వారికంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వూ (ఆత్మ సంయమ) యోగివి కావలెను.
      యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా ఎవరు సేవిస్తారో. అతడు ఉత్తముడని నాఅభిప్రాయము.
............................................................

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది