🤦🏻♀🔥🤺➖➖➖➖➖➖➖
*భారత అత్యవసర స్థితి - (1975-1977)*
➖➖➖➖➖➖➖🌸🌸🍃
_"ఇందిరయే ఇండియా, ఇండియానే ఇందిరా."_
౼కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె.బారువా
*★ ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ తో 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకూ జాతీయ అంతర్గత అత్యవసర స్థితిని విధింపజేసిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.*
*■ అప్పటిప్రధాని ఇందిరాగాంధీ ఏకపక్షం గా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్య కాలంలోని 21-నెలల కాలాన్ని భారత అత్యవ సర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారు.*
*■ భారతరాజ్యాంగంలోని 252(1) అధికరణం లో అంతర్గత కల్లోలస్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా విధింప జేశారు.1977 మార్చి 21లో ఉపసం హరించే వరకూ కొనసాగింది. ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను నిలిపివేసి, పౌరహ క్కులు అడ్డుకునే అధికారాన్ని ప్రధాన మంత్రికి ఈ ఆర్డర్ అందించింది.*
■ ఎమర్జెన్సీలో ప్రధానంగా ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్ చేశారు. ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ ముందుండి నడిపిన మాస్-స్టెరిలైజేషన్ (సామూహిక గర్భనివారణ కార్యక్రమం) వంటి ఇతర దురాగతాలు కూడా నివేదితం అయ్యాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటి.
*🔥నేపథ్యం...🏜*
*ఇందిరాగాంధీ రాజకీయ ఎదుగుదల..🤺*
■1971 నాటికి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది, అలాగే పార్లమెంట్ లో భారీమెజారిటీ కూడా పొందారు. ప్రభుత్వం పై పట్టును సాధించేందుకు క్యాబినెట్ చేతి లోంచి కేంద్ర ప్రభుత్వ అధికారాలు ప్రధాని కార్యాలయం తీసేసుకుంది. క్యాబినెట్ మంత్రులు అధికార కేంద్రాలుగా మారతారన్న భయంతో ఈ పనిచేశారు. ఈ క్రమంలో కిచెన్ క్యాబినెట్ గా వ్యవహరించే ఆమె అంతర్గత సలహాదారుల బృందంలోని ముఖ్యుడు, ముఖ్యకార్యదర్శి పి.ఎన్.హస్కర్ పై నమ్మకాన్ని పెట్టుకున్నారు.
*■ ఇందిర కాంగ్రెస్ పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేశారు, ఆ క్రమంలో పార్టీ 1969లో కాంగ్రెస్ (ఓ)【Organization】, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు ఇందులో ఉన్నారు) మరియు ఇందిర యొక్క కాంగ్రెస్ (ఆర్)【Requisition 】కింద విడిపోయింది. ఆలిండి యా కాంగ్రెస్ కమిటీ లోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. పూర్వపు కాంగ్రెస్ పార్టీ పద్ధతుల్లోని అంతర్గత ప్రజాస్వామ్యం వంటివి లేకుండా ఇందిర పార్టీ విధానాలు వ్యతిరేకంగా తయారయ్యాయి. కాంగ్రెస్ (ఆర్) లో నాయకులు ఇందిరా గాంధీకి, ఆమె కుటుంబానికి విధేయంగా, సన్నిహితంగా ఉండడం వల్లనే తాము పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందగలమని తెలుసుకున్నారు. మితిమీరిన పొగడ్తలు సర్వసాధారణమై పోయింది.*
*■ ఆమె ప్రభుత్వం 1969లో బ్యాంకుల జాతీయీకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు చేపట్టడంతో ప్రజల్లో ఆమె పలుకుబడి పెరిగింది. ఆ పలుకుబడి వల్ల ఇందిరకు తనమాట చెల్లించుకోగల సామర్థ్యం వచ్చింది. ఈ కార్యకలాపాలు కూడా హఠాత్తు గా ఆర్డినెన్సుల ద్వారా చేపట్టి తన ప్రత్యర్థుల ను షాక్ కి గురిచేసేవారామె. సిండికేట్ మరియు ఇతర ప్రత్యర్థుల ఇమేజికి భిన్నంగా, ఇందిరను "ఆర్థికరంగంలో సోషలిజం, మతపరంగా లౌకికత్వం, పేదల పక్షపాతంతో మొత్తానికి దేశాభివృద్ధికి అనుకూలురాలిగా" భావించేవారు.*
*■ 1971 సాధారణ ఎన్నికల్లో, ప్రజలను ఇందిరా గాంధీ ఇచ్చిన గరీబీ హఠావో! (పేదిరక నిర్మూలన) అన్న నినాదం ఉత్తేజ పరిచింది. ఆ ఎన్నికల్లో ఆమెకు 518 లోక్ సభ స్థానాలకు 352 భారీ ఆధిక్యత లభించింది.*
● _చరిత్రకారుడు 'రామచంద్ర గుహ' అనంతర కాలంలో రాసినట్టు "ఆ భారీ విజయంతో కాంగ్రెస్ (ఆర్) తన ఉనికిని గుర్తుచేసే (ఆర్) అన్న ప్రత్యయం అవసరం లేకుండా నిజమైన కాంగ్రెస్ గా పేరొందింది"._
*■ 1971లో, ఆమె యుద్ధ నాయకత్వంలో భారతదేశం బంగ్లాదేశ్ విమోచనాన్ని విజయవంతంగా నిర్వహించింది. తన ఆగర్భ శత్రువైన పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడించి, అప్పటివరకూ తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్ అన్న నూతన దేశంగా ఏర్పరచడంలో భారతదేశం, అందునా ప్రధాని ఇందిర, ముఖ్య పాత్ర వహించారు. తర్వాతి నెలలో భారతరత్న పురస్కారం అందుకుని తన జీవితంలో అత్యున్నత శిఖరం అనదగ్గ కాలాన్ని అనుభవించారు.*
● _ఆమె జీవితచరిత్రకారుడు ఇందర్ మల్హోత్రా ప్రకారం అప్పటికి "ద ఎకనమిస్ట్ అభివర్ణించి నట్టుగా భారత సామ్రాజ్ఞి అన్న పదం సరిపోయిందన్నట్టుగా తోచింది"._
■ లోక్ సభలో ఆమెను సాధారణంగా నియంతలా వ్యవహరిస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని గురించి భట్రాజు పొగడ్తలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించే ప్రతిపక్ష నేతలే ఆమెను దుర్గ, చండి అంటూ ప్రశంసించారు. ఇందిరను దుర్గగా వాజపేయి అభివర్ణించారని ప్రతీతి, కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కాదని చెప్పారు.
*☄న్యాయవ్యవస్థపై ప్రభుత్వం నియంత్రణ..🎓*
*★ ప్రఖ్యాత 'గోలక్ నాథ్ కేసు'లో భారత అత్యున్నత న్యాయస్థానం మౌలికాంశాలైన ప్రాథమిక హక్కులు వంటివాటిని ప్రభావితం చేస్తూన్నప్పుడు రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించకూడదని వ్యాఖ్యానించింది. ఈ తీర్పును రద్దుచేస్తూ ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్న పార్లమెంట్ 1971 లో ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలాంటి రాజ్యాంగ సవరణలు కూడా చేయొచ్చన్న 24వ సవరణ ఆమోదించింది.*
*■ పూర్వపు రాజులు, జమీందార్లకు ఇచ్చిన రాజాభరణాలు రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణ యాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పునిస్తే 26వ సవరణ తీసుకువచ్చారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసే విధంగా రాజభరణాల రద్దును రాజ్యాంగ బద్ధం చేశారు.ఈ న్యాయవ్యవస్థ-శాసనవ్యవ స్థల నడుమ యుద్ధం చారిత్రాత్మక 'కేశవానంద భారతి కేసు 'వరకూ కొనసాగింది. ఈ కేసు తీర్పులో 24వ సవరణ ప్రశ్నించబడింది. అతికొద్ది 7-6 ఆధిక్యతతో, సుప్రీంకోర్టు ధర్మాసనం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణచేసే హక్కును నియత్రిస్తూ రాజ్యంగ మౌలిక నిర్మాణాన్ని మార్చేందుకు వినియోగిం చరాదని తీర్పునిచ్చింది.*
■ తదనంతరం కేశవానంద భారతి కేసులో తీర్పుని వ్యతిరేకించిన మైనారిటీలోకెల్లా సీనియర్ అయిన ఎ.ఎన్.రేని భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రధాని ఇందిర నియమించా రు.ఈ నియామకంలో తీర్పుకుఅనుకూలమైన మెజారిటీలోని ముగ్గురు సీనియర్ జడ్జిలు - జె.ఎం.షెలాత్, కె.ఎస్.హెడ్గే, గ్రోవర్ లను అధిగమించి రేని పదవి వరించింది. స్వతంత్రం గా ఉండాల్సిన న్యాయవ్యవస్థను ఇందిర నియంత్రించే ప్రయత్నాలు చేయడాన్ని అటు పత్రికలు,ఇటు జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
*🔥☄రాజకీయ అలజడి..☄🔥*
■ 1973-75 కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త రాజకీ య ఆందోళనలు చెలరేగాయి. (దీనివల్ల కొందరు కాంగ్రెస్-పార్టీ నేతలు మరింత శక్తిని ఎన్నికైన పరిపాలకుని చేతిలో పెట్టేలాంటి ప్రెసిడెంట్ విధానం కావాలని కోరారు).
☄ మొదటి అంశం.. డిసెంబరు 1973 నుంచి మార్చి 1974 వరకూ గుజరాత్ లో సాగిన 'నవ నిర్మాణ్ ఉద్యమం' వీటన్నిటిలోనూ ప్రసిద్ధిపొందింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమం చినికి చినికి గాలివానగా మారి ప్రభుత్వాన్నిరద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధింపు జరిగాయి. 1977లో తిరిగి ఎన్నికలు జరిగాకా జనతా కూటమిచేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
☄ మరో అంశం..మార్చి-ఏప్రిల్ 1974లో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ ఛాత్ర సంఘర్ష్ సమితి చేసిన విద్యార్థి ఉద్యమానికి జెపిగా వ్యవహరించే గాంధేయ సోషలిస్టు, ప్రముఖనాయకుడు జయప్రకాష్ నారాయణ్ మద్దతు లభించింది. 1974 ఏప్రిల్లో పాట్నాలో జెపి విద్యార్థి,రైతు,కార్మిక సంఘాలు అహింసా యుతంగా భారతీయ సమాజాన్ని మార్చాలం టూ "సంపూర్ణ విప్లవానికి" పిలుపునిచ్చారు. అలానే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు, కానీ కేంద్రం అంగీకరించలేదు.
☄మరో అంశం..నెలరోజుల తర్వాత దేశం లోకెల్లా అతిపెద్ద యూనియన్ అయిన భారతీయ రైల్వే ఉద్యోగుల యూనియన్ దేశవ్యాప్త సమ్మె చేసింది. వేలాదిమంది కార్మికులను నిర్బంధించి, వారి కుటుంబాలను రైల్వే క్వార్టర్స్ నుంచి తరిమివేసి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ సమ్మెను దారుణంగా అణచివేసింది. పార్లమెంటులో కూడా ప్రభుత్వం చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. 1966లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇందిరాగాంధీ
లోక్ సభలో 10 అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు.
*☄ మరో ముఖ్యమైన అంశం..*
*రాజ్ నారాయణ్ కేసు తీర్పు రావడం..*
●1971 పార్లమెంటరీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఇందిరాగాంధీ ఎన్నిక ల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించు కున్నారని కేసు దాఖలుచేశారు. నారాయణ్ తరఫున రాజకీయ నాయకుడు, న్యాయవాది శాంతి భూషణ్ వాదించారు. ఇందిరా గాంధీ ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సివచ్చింది. ఓ ప్రధాని కేసు విచారణలో ప్రశ్నించబడడం అదే తొలిసారి.
● 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్ లాల్ సిన్హా ప్రధాని మీది ఆరోపణలు వాస్తవమని తేలిందంటూ కేసు తీర్పునిచ్చారు. ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పునివ్వడమే కాక, ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని రద్దుచేశారు. ఓటర్లకు లంచాలివ్వడం, ఎన్నికల అక్రమాలు వంటి ఆరోపణలు వీగిపోయాయి, కానీ ఆమె ప్రభుత్వ యంత్రాగాన్ని తప్పుగా వినియోగిం చుకున్న అంశంలో నేరస్తురాలని తేలింది.
*■ అంతేకాక, వ్యాపార, విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగ యూనియన్లు చేసిన ఆందోళనలతో దేశంలోని పలుప్రాంతాలు స్తంభించిపోయా యి. జెపి, రాజ్ నారాయణ్, సత్యేంద్ర నారా యణ్ సిన్హా, మొరార్జీ దేశాయిల నాయకత్వం లో ఢిల్లీలో చేసిన ఆందోళనలో పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసాలకు దగ్గర్లోని రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. ప్రధానికి వ్యతిరేకంగా జస్టిస్ సిన్హా తీర్పునివ్వడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టడంతో నారాయణ్ నిరంతర ప్రయత్నాలు, పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.*
*■ ఇందిరాగాంధీ హైకోర్టు నిర్ణయాన్ని*
*దేశ అత్యున్నత న్యాయస్థానం లో సవాలుచేశారు. జస్టిస్ వి. ఆర్. కృష్ణ అయ్యర్ 1975 జూన్ 24న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, ఎంపీగా ఇందిర పొందుతున్న అన్ని సౌకర్యాలను ఆపివేయాలని, ఓటింగు నుంచి నిరోధించా లని ఆదేశించారు. ఐతే ఆమె ప్రధానిగా కొనసాగడానికి అనుమతించారు..*
..పైకారణాల వల్ల ,ఇందిరాగాంధీ డిపెన్స్ లో
పడినట్లుగా అర్థమవుతుంది. ఆ స్థితిలో తన ఆధిక్యం నిలుపుకోవడానికి అత్యవసర స్థితికి
కారణమైనది..
(1975 జూన్25 నుంచి,1977 మార్చి 21వరకు)
🍃🌸🤗🌸🍃