👤💺➖➖➖➖➖➖➖➖
*భారతదేశ 8వ ప్రధాని..'విశ్వనాధ్ ప్రతాప్ సింగ్' గారి జయంతి నేడు..* June 25
➖➖➖➖➖➖➖🌸🌸🍃
_ప్రభుత్వ ఉద్యోగాలలో మండలకమిషన్ నివేదిక ప్రకారం వెనుకబడినకులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని._
*■థర్డ్ ఫ్రంట్ మూలపురుషుడు, రైతు నాయకుడిగా, సెక్యులర్ భావాలను కాపాడిన వ్యక్తిగా,కరడుగట్టిన బీసీ నాయకుడి గా వీపీ సింగ్ పేరుపొందారు. జనతాదళ్ సీనియర్ నేత గా,1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు.*
*■ విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ 1931, జూన్ 25న ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించా రు. దేశ పదో ప్రధానిగా 11 నెలలపాటు (1989 డిసెంబర్ 2న పదవీ బాధ్యతలు స్వీకరించిన వీపీ సింగ్, 1990 నవంబర్10 వరకు) ప్రభుత్వాన్ని నడిపిన ఆయన.. బీజేపీ, కమ్యూనిస్టుల మద్దతుతో పదవి చేపట్టారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో గద్దె దిగాల్సి వచ్చింది.*
■ అంతకుముందు ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. రాజీవ్ గాంధీ హయాంలో ఆయన కీలక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
*■ బీసీలకు 27శాతం రిజర్వేషన్ కల్పించడం లో వీపీ సింగ్ కీలక పాత్ర వహించారు. విద్య, ఉద్యోగాల్లో వెనకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయించడానికి ఆయన పెద్ద ఉద్యమం చేపట్టారు. దీంతో జనతాదళ్ కు విశేష ప్రాచుర్యం లభించింది. తర్వాత నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడడంలో వీపీ సింగ్ పాత్ర ఎనలేనిది.*
*■ ఐకే గుజ్రాల్, దేవెగౌడలను ప్రధానమంత్రుల ను చేయడంలో, కేఆర్ నారాయణన్ ను రాష్ట్రపతిని చేయడంలోను ఆయన విశేష కృషి సల్పారు.*
*★ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కు ఒకరకంగా వీపీ సింగ్ మూల కారకుడని చెప్పచ్చు. ఆ క్రమంలోనే కాన్షీరాం నేతృత్వంలో బహుజనసమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఏర్పడింది.*
■ కాంగ్రెస్ తో రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటికీ పార్టీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. తర్వాత విభేదాలతో బయటకు వచ్చి జనతాదళ్ పార్టీని స్థాపించాడు. ఉత్తర భారతదేశంలోనే కాక కర్ణాటకలోను జనతాదళ్ అధికారంలోకి రావడానికి వీపీ సింగ్ ఎనలేని కృషి చేశారు.
*◆ దశాబ్దానికి పైగా కేన్సర్ తో బాధపడిన వీపీసింగ్.. 77 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.*
..మొత్తం మీద అశేష ప్రజాదరణ పొందిన రాజకీయనాయకుడిగా విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ దేశ ప్రజలకు చిరకాలం గుర్తుండిపోతారు.
(జూన్25,1931-నవంబరు 27,2008)
🍃🌸🤗🌸🍃