ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరొగ్య సూక్తులు.

🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరొగ్య సూక్తులు.

* ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను . రెండు మైళ్లు వరకు నడవవలెను .

* రాత్రి భోజనం అయ్యిన తరువాత ఒక మైలు దూరం నడుచుట చాలా మంచిది .

* రాత్రి భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయుట మంచిది .

* రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది .

* ఆహారం ని పూర్తిగా నమిలి మింగవలెను.

* స్నానం చేసిన వెంటనె భోజనం చేయరాదు . అలా చేసినచో జీర్ణశక్తి  నశించును. గంట సమయం తరువాతనే
భోజనం చేయవలెను .

* రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో వళ్ళు బరువెక్కును . చురుకు లేకుండా ఉండును.

* దంతధావనం అనంతరం యే వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి ప్రతినిత్యం మింగుతూ ఉన్నయెడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును.

* నిద్రనుంచి లేచిన వెంటనె మంచినీటిని సేవించరాదు. అలా త్రాగిన యెడల జలుబు చేయును . ఫలములు తీసుకున్న వెంటనె కూడా నీటిని సేవించరాదు .

* వేడి వస్తువులు తీసుకున్న వెంటనె చల్లని నీరు తీసుకోకూడదు.

* అతి కారం గల వస్తువులు , అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును.

* రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను ఉదయం ఎమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను . ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును.

* బాగా ఆకలి గా ఉన్నప్పుడు నీటిని తాగుట , దాహాంగా ఉన్నప్పుడు అన్నం తినటం వలన కడుపునొప్పి వచ్చును.

* కడుపు ఉబ్బరం గా ఉండి పుల్లటి తేపులు వచ్చుచున్నప్పుడు చల్లటి మంచినీరు తాగవలెను.

* అన్నం తినేముందు గాని , తిన్న తరువాత గాని అల్లం మరియు ఉప్పు తింటూ ఉన్న యెడల జీర్ణశక్తి ఎక్కువ అగును.

* మూసి ఉన్న ఇంట్లో గాని గదిలోకి గాని తలుపు తీసి వెంటనె ప్రవేశించరాదు. తలుపు తీసి అయిదు నిమిషములు దూరముగా ఉండి లొపల ఉన్న గాలి బయటకి వెళ్లిన తరువాత మాత్రమే లొపలికి వెళ్లవలెను .

* నిద్రించే గదిలో చెడు వాయువులను ఉత్పతి చేసేటువంటి వస్తువులు ఉంచరాదు.

* బట్టలు బిగుతుగా కట్టుకోరాదు. వదులుగా ఉండవలెను .

* శిరస్సు చల్లగా ఉంచుకొనుట , పాదములు వెచ్చగా ఉంచుకొనుట ఆరోగ్యవంతులు యొక్క లక్షణం .

* మలమూత్రములు బిగపట్టుకొని ఉండకూడదు వెంటనె విసర్జించవలెను . అలాగే తుమ్ములు మరియు ఆవలింతలు ఆపుకొనకూడదు. లేనిచో భయంకరమయిన వ్యాధులు సంభంవించును.

* సారా మొదలయిన మత్తుపదార్థాలు సేవించరాదు . దానివల్ల ఆకలి చెడిపోయి బుద్ది చెడిపొవును.

* మిక్కిలి ప్రకాశవంతమైన వెలుతురు , మధ్యాన్న సూర్యుడిని చూడరాదు.

* అవసరం లేకుండా కళ్ళజోడు ధరించరాదు. కళ్లు చెడిపొవును.

* చిన్న అక్షరాలు గల పుస్తకాలు రాత్రి యందు చదవరాదు.

* భోజనం చేసిన వెంటనె వ్యాయమం , మైధునం చేయరాదు . ఆరోగ్యం చెడిపొవును.
⛷🏋‍♀🤺🤼‍♀🤸‍♀⛹‍♀🤾‍♂🏌🏄

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది