వంకాయ మాజాక

అన్నం ముందు కూర్చుని..
భార్య కంచంలో కూర వేయబోతుండగా..
కోపంతో పళ్ళెం విసిరికొట్టి..
"ఛీ ఛీ..ఏంటిది..?
మళ్ళీ వంకాయేనా..?
నీకెంత ఇష్టమైతే మాత్రం..
నాలుగు రోజులనుండీ
రోజూ వంకాయే పెట్టి చంపుతావా..!!
నీకేమయినా పిచ్చా..?
మరో రెణ్ణెల్లదాకా వంకాయ పేరెత్తినా చంపేస్తా..!!"
ఆవేశంగా అరిచాడు భర్త.
'సరే.. ఇదే పద్ధతి మీ డ్రింక్స్ కూ పాటిద్దాం.. సరేనా..?"
కూల్ గా అడిగింది భార్య.
''ఊఁ.. సర్లే..
ఏదీ.. కంచం ఇలా పెట్టు.. కొద్దిగా కూరవెయ్యి..
అబ్బ.. చాలా బాగుంది..!
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. నువ్వు వంకాయ స్పెషలిష్టువి..!
రేపు గుత్తొంకాయ చెయ్యి.. నాకు చాలా ఇష్టం.. సరేనా..!!"
😂😂😉

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది