👱♀ దేవసేన నోటిదూల !🤔
రాజమౌళి మామూలోడు కాదు భయ్యా ... ఆడోళ్ళ వల్ల రాజ్యాలే కూలిపోనాయని ఇన్నాం . ఇప్పుడు దేవసేన నోటి దూలకి బాహుబలి అనే గొప్ప ఈరుడు ఎలా సంకనాకిపోయాడో కళ్లారా సూపించేసినాడు .
ఆడాళ్ళు నోటిని అదుపులోపెట్టుకోకపోతే ఏమవుద్ది ? సదవండి... 👇
ఫస్ట్ ఫస్ట్ ... మాహిష్మతి లోకి బందీగా అడుగెట్టినాది 👱♀. మరి బందీ అన్నప్పుడు అత్తమ్మ అత్తమ్మా అనుకుంటా మంచిగా మాటాడాలిగందా . అత్తగారి మీద 👵కయ్యి కయ్యి మనిపోనాది , అంతమందిముందు దునుమాడేసినాది . అంతే ... బాహుబలి మారాజు 🤴కావల్సినోడల్లా సేనాదిపతి అయిపోనాడు 🤦♂.
రెండోసారి పోనీ సేనాధిపతిలాగైనా బాగనేవున్నాడు కదా అనుకుంటే సీమంతానికొచ్చిన అత్తగారితో మళ్లీ అగ్గెట్టేసుకున్నాది 🤰. ఇంకేటవుద్ది ... సేనాపతి కాస్తా మామూలోడైపోనాడు 🙍♂.
ముచ్చటగా మూడోసారి సేనాధిపతి వేళ్ళు నరికేసి సంకెళ్ళేయించుకుని సభలోకొచ్చినాది 🙍 . పాపం తాను మాత్రం యేటి సేత్తాది . అలవాటైపోయిన పేనం మరి... అత్తగారిని 👵🏻 సూడగానే ఉప్పు నిప్పైపోనాది ... పెనం మీద పేలాపు గింజలాగా సిటపటలాడిపోనాది ...ఇంకేటవుద్ది ? మొగుడి మెడట్టుకుని రాజమందిరం నుంచి బయటకి గెంటినారు 🙆🏻♂ .
గుడిసెలోకొచ్చిపడినారు ... పోనీ మంచోళ్ళు మజ్జలోకొచ్చినారు కాయకష్టం సేసుకుంటూ బాగానే వున్నారనుకుంటే.. సీతమ్మోరు రాములోరిని బంగారులేడి కావాలనడిగినట్టు పిల్లోడు పుట్టేటప్పటికీ కట్టప్ప కావాలనడిగినాది . అసలే చలి పొద్దు 👳🏻... అద్దరేత్రి గుడిసెలో ముడుసుపెట్టుకుని పడుకోక నాకెందుకొచ్చిన తద్దినం అనుకుంటానే ఎల్లి కట్టప్ప 👴🏻సేతిలోనే ఖతమైపోనాడు. అక్కడతో బాహుబలి కథ ముగిసిపోనాది . పెళ్ళాం నోరు అదుపులో పెట్టనేకపోతే బొక్కడేది మొగుడికని ప్రూవింగ్ అయిపోనాది . 🤦🏻♂
ఆగండాగండి ... కథ ఇంకా అయిపోనేదు , కొసమెరుపు ఉండిపోనాది . కట్టప్ప 👴🏾 సెప్పిన ఈ స్టోరీ అంతా విన్న సిన్న బాహుబలి కి 👳 అమ్మ నోటి పవర్ గురించి బాగా తెలిసొచ్చేసినాది . అమ్మ 👵🏾 నోరు తెరిస్తే ... తాను కూడా శంకరగిరి మాన్యాలు అట్టుకుపోవాలని అర్దమైపోయి దేవసేనని నోరు తెరవనివ్వలేదు. భళ్లాల దేవుడితో యుద్ధానికి ముందు కానీ , యుద్ధం లో దేవసేన సొంత అన్నగారిని భళ్లాల దేవుడు చంపేసినప్పుడు కానీ , యుద్దం అయిపోయి భళ్లాలదేవుడిని తగలెట్టేప్పుడు కానీ ... సివరాకరికి పట్టాభిషేకం 🤴 జరిపించుకుంటున్నప్పుడు కూడా నోరు తెరవనివ్వలేదు . ఇంత తెలివైనోడు కాబట్టే అడవిలో గూడెం లో పెరిగినా మాహిస్మతికి చక్రవర్తయిపోనాడు 👑. పెళ్ళాం నోటికి జడిసి అగ్గగ్గలాడతా ఉండిపోనాడు కనకే పెద్ద బాహుబలి కరుసైపోనాడు. 🙅🏻♂
దీన్ని బట్టి మనందరికీ తెలిసొచ్చేదేంటంటే ... నోటి దూల తగ్గించుకోవాల , అందరితో మంచిగ మాట్లాడాల ... 🙏
😜😜😜